Nelson Dilip Kumar: అత‌న్ని హీరోగా వ‌ద్ద‌న్నా.. ధ‌నుష్ ,విజ‌య్‌ల‌ను పెట్టుకోమ‌ని చెప్పా

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:40 PM

‘బ్లడీ బెగ్గర్‌’ చిత్ర కథకు హీరోగా కవిన్ ను వద్దని ఆరంభంలో చెప్పానని, కానీ, సినిమా షూటింగ్‌ పూర్తయి తొలికాపీ చూసిన తర్వాత కవిన్‌ను వద్దని చెప్పడం వల్ల ఎంత పెద్ద తప్పు చేశానో తాను గ్రహించానని నెల్సన్‌ దిలీప్‌ కుమార్ అన్నారు.

Kavin

‘బ్లడీ బెగ్గర్‌’ (Bloody Beggar) చిత్ర కథకు హీరోగా కవిన్ (Kavin) ను వద్దని ఆరంభంలో చెప్పానని, కానీ, సినిమా షూటింగ్‌ పూర్తయి తొలికాపీ చూసిన తర్వాత కవిన్‌ను వద్దని చెప్పడం వల్ల ఎంత పెద్ద తప్పు చేశానో తాను గ్రహించానని ఈ చిత్ర నిర్మాత, మాస్ట‌ర్‌, జైల‌ర్,డాక్ట‌ర్‌ వంటి సినిమాల‌ ద‌ర్శ‌కుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (Nelson Dilipkumar) అన్నారు. ఫిలమెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘జైలర్‌’ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘బ్లడీ బెగ్గర్‌’. కవిన్‌ హీరో. శివబాలన్‌ ముత్తుకుమార్‌ దర్శకుడు. జెన్‌ మార్టిన్‌ సంగీతం అందించారు.

Nelson.jpg

ఈ నెల 31న సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల చెన్నైలో ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నెల్సన్ (Nelson Dilipkumar)మాట్లాడుతూ..‘స్టోరీ వినిపించినపుడు ‘జైలర్‌’ షూటింగు జరుగుతుంది. ఈ సినిమా హిట్‌ అయితేనే నిర్మాతగా సినిమా తీస్తానని శివబాలన్‌కు షరతు పెట్టాను. అందుకే ‘జైలర్‌’ మూవీ హిట్‌ కావాలని నాకేంటే బలంగా కోరుకున్నాడు.

kavin.jpg

హీరోగా కవిన్ (Kavin) కావాలని కోరగా, నేను వద్దని కరాఖండిగా చెప్పి, ధనుష్‌, విజయ్‌సేతుపతి వంటి మరికొందరి పేర్లను సూచించాను. అయితే, ఈ చిత్రం తొలికాపీ చూసిన తర్వాత కవిన్‌ వద్దని చెప్పడం నేను పెద్ద తప్పు చేశానని గ్రహించా. ఇది ఒక థ్రిల్లర్‌ కోణంలో ఉన్నప్పటికీ డార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. దీపావళికి శివకార్తికేయన్‌ ‘అమరన్‌’, జయం రవి ‘బ్రదర్‌’ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటితో పాటు మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు, మీడియా ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు.

Kavin

హీరో కవిన్‌ మాట్లాడుతూ.. ‘ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకే ఈ చిత్రం తెరకెక్కడానికి ప్రధాన కారణం. నాకు ఇండస్ట్రీలో స్థానం కల్పించిన వ్యక్తి నెల్సన్‌. నా జీవితంలో మరిచిపోలేని చిత్రంగా ఉంటుంది. దర్శకుడుగా శివబాలన్‌కు, నిర్మాతగా నెల్సన్‌కు తొలి చిత్రం. చాలా సింపుల్‌ కథ. ప్రతి ఒక్కరికీ నచ్చే రీతిలో తెరకెక్కించారు. ‘అమరన్‌’, ‘బ్రదర్‌’, ‘బ్లడీ బెగ్గర్‌’ (Bloody Beggar) సినిమాలను చూసి దీపావళిని జరుపుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. దర్శకుడు శివబాలన్‌ మాట్లాడుతూ.. ‘నేను రాసిని కథకు కవిన్ (Kavin) ప్రాణం పోశాడు. దర్శకుడుగా నెల్సన్‌ అనేక ప్రశ్నలు అడుగుతారు. నిర్మాతగా కూడా అలానే ఉంటారని భావించా. కానీ, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయనకు ధన్యవాదాలు’ అని అన్నారు.

Kavin

Updated Date - Oct 20 , 2024 | 08:40 PM