Director Hari: ఆమె కోపానికి అర్థం ఉంది.. ఆ తర్వాత తెలిసింది!
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:19 PM
లేడీ సూపర్‌స్టార్ నయనతారపై దర్శకుడు హరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్య్యాయలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో అవమానాలు పడ్డారు.
లేడీ సూపర్‌స్టార్ నయనతారపై (Nayanathara) దర్శకుడు హరి (Director Hari) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో అవమానాలు పడ్డారు. కొందరు దర్శకులైతే నువ్వు నటిగా పనికి రావని ముఖం మీదే చెప్పిన సందర్భాలున్నాయి. ఎన్నో సందర్భాల్లో ఆమె అవన్నీ గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కానీ ఇప్పుడామె దక్షిణాదిలో సూపర్‌స్టార్. నయనతారకు తమిళంలో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు హరి కూడా ఆమె ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఈ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదని చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార ప్రస్తావన రాగా హరి ఇలా స్పందించారు. "నేను దర్శకత్వం వహించిన 'అయ్యా’ చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేశాను. అందులో ఆమె 12వ తరగతి చదివే యువతిగా నటించింది. ఆ సినిమాకు వర్క్ చేస్తున్న సమయంలో నయనతార చాలా కోపంగా ఉండేది, ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుందా? అని అనిపించేది. దుస్తుల విషయంలో కూడా వాదించేది. అయితే ఆ కోపానికి అర్థం కూడా ఉంది. ఆ కోపమంతా పని బాగా జరగాలనే భావం అని నాకు తర్వాత తెలిసింది. నయనతార మంచి నటిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలుసుగానీ, మరీ ఈ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదు అన్నారు దర్శకుడు హరి.కేరళలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన నయన ఇప్పుడు దక్షిణాదితోపాటు ఉత్తరాధిన కూడా హీరోయిన్ గా వెలుగుతోంది. నటిగానే కాకుండా నిర్మాతగానూ కొనసాగుతోంది. ఎన్ స్కిన్ పేరుతొ కాస్మోసిట్ బిజినెస్ కూడా ప్రారంభించింది.
Read Latest Cinema News