హీరోగా.. మరో దర్శకుడు
ABN , Publish Date - Nov 05 , 2024 | 08:12 PM
కోలీవుడ్ దర్శకుడు ఎం.ముత్తయ్య త్వరలోనే హీరోగా వెండితెరపై కనిపించనున్నట్టు సమాచారం. ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘కుట్టిపులి’, ‘కొంబన్’, ‘మరుదు’, ’విరుమన్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
కోలీవుడ్ దర్శకుడు ఎం.ముత్తయ్య (M. Muthaiah) త్వరలోనే హీరోగా వెండితెరపై కనిపించనున్నట్టు సమాచారం. ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘కుట్టిపులి’, ‘కొంబన్’, ‘మరుదు’, ’విరుమన్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మంచి కథాంశాలను ఎంచుకుని చిత్రాలను ఈయన తెరకెక్కిస్తుంటారు.
ఈ క్రమంలో ఆయన చివరగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఖాదర్ బాషా ఎన్‌గిర ముత్తురామలింగం’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు. ఈ క్రమంలో ఆయన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మరో చిత్రానికి ప్లాన్ చేశారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.