Vaazhai: నా సినిమాకు.. ‘హింస’ అనే రంగు ఎందుకు పులుముతున్నారు?

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:56 AM

తాను రూపొందించే చిత్రాలకు ‘హింస’ అనే రంగు ఎందుకు పులుముతున్నారని సినీ దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రశ్నించారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘వాళై’ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

mari

తాను రూపొందించే చిత్రాలకు ‘హింస’ అనే రంగు ఎందుకు పులుముతున్నారని సినీ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) ప్రశ్నించారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘వాళై’ (Vaazhai) శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. దీన్ని పురస్కరించుకుని, సినీ ప్రముఖులకు, సినిమా పాత్రికేయులకు ఈ సినిమా ప్రత్యేక షో ప్రదర్శించారు.

Vaazhai

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సామాన్య ప్రజానీకానికి సంబంధించిన కథలను ఆవిష్కరించే సమయంలో వారిలోని కోపతాపాలను కూడా చూపించాల్సి ఉంది. ఇవి సమాజానికి వ్యతిరేకమైనవంటూ ఒక ముద్ర వేస్తున్నారు. ఈ కారణంగా ఒక దర్శకుడిగా స్వతంత్రంగా పని చేయలేకపోతున్నా. పూర్తిగా నన్ను అర్థం చేసుకునేందుకు తీసిన చిత్రం ఇది. నా బాల్యంలో చోటు చేసుకున్న ఒక సంఘటనలనే ఈ సినిమా కథ.


Maari-Selvaraj-in-Instagram.webp

ఇందులోని క్లైమాక్స్‌ నా జీవితంలో మరిచిపోలేని ముఖ్య సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. బాల్యంలో నేను ఏం చూశానో అదే వెండితెరపై ఆవిష్కరించాను. నేను ఎవరు అని నిరూపించుకునేందుకు ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించాను. నిజం చెప్పాలంటే ఈ కథనే నా తొలి చిత్రంగా తీయాలని భావించాను. కానీ, అపుడు సాధ్య పడలేదు. ఇప్పటికీ పూర్తయింది’ అని వెల్లడించారు.

Updated Date - Aug 25 , 2024 | 01:26 PM