GK19: గౌతం కార్తీక్ చిత్రానికి.. రాజు మురుగన్ సంభాషణలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:10 AM
యువ హీరో గౌతం కార్తీక్ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ సంభాషణలు అందిస్తున్నారు.
యువ హీరో గౌతం కార్తీక్ (Gautham Karthik) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ (Rajumurugan) సంభాషణలు అందిస్తున్నారు. ఎంజీ స్టూడియోస్ (MG studio) పతాకంపై ఏపీవీ మారన్ (APV Maran) , ‘డాడా’ ఫేం గణేష్ కె బాబు (ganesh.k.babu) సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజు మురుగన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన దినా రాఘవన్ (Dhina M Raghavan) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, ‘దక్షిణ చెన్నైలోని తరమణి వంటి ప్రాంతంలో రాజకీయాలను ఒక సాధారణ ఘటన ద్వారా, పొలిటికల్ సెటైర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాలు, సామాన్యుడి నిజ జీవితం కలగలిసిన ఈ చిత్రంలో వినోదానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు.
ఇందులో హీరో పాత్ర ఒక ఏరియా కుర్రోడు రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నది ప్రధాన కథాంశంగా ఉంటుంది. మనింట్లో కుర్రాడిని తలపించేలా గౌతం పాత్ర ఉంటుంది. జీకే19 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు.