‘బ్లడీ బెగ్గర్’.. డార్క్ కామెడీ థ్రిల్లర్! నిజంగా బెగ్గర్ అనుకోని రూ.20 ఇచ్చారు
ABN , Publish Date - Oct 19 , 2024 | 09:53 AM
యంగ్ హీరో కెవిన్ కథానాయకుడిగా రూపొందిన‘బ్లడీ బెగ్గర్’ చిత్రం డార్క్ కామెడీతో కూడిన డ్రామా థ్రిల్లర్ అని ఆ సినిమా దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్అన్నారు. హీరో కెవిన్ ఆ వేషంలోనే కెవిన్ రోడ్డుపై నిజంగానే భిక్షాటన చేయగా, ఎవరూ గుర్తుపట్టలేదని అన్నారు.
యంగ్ హీరో కెవిన్ కథానాయకుడిగా తాను తెరకెక్కించిన ‘బ్లడీ బెగ్గర్’ (Bloody Beggar) చిత్రం డార్క్ కామెడీతో కూడిన డ్రామా థ్రిల్లర్ అని ఆ సినిమా దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ (Sivabalan Muthukumar) అన్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్ర విశేషాలను ఆయన వివరించారు. ‘ఇందులో హీరో ఆరంభం నుంచే ‘బ్లడీ బెగ్గర్’గా ఉంటారు. ఆయన అలా ఎందుకున్నారనే అంశంతో స్టోరీ ప్రారంభమవుతుందన్నారు.
ఈ చిత్రాన్ని చూసి నెల్సన్ కుమార్ మెచ్చుకున్నారన్నారు. నిజానికి ఈ చిత్రం నెల్సన్ ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన లేదు. పలువురు నిర్మాతలను సంప్రదించిన తర్వాత స్క్రిప్టుపై ఉన్న నమ్మకంతో నిర్మాతగా ముందుకు వచ్చారన్నారు. స్వతహాగా దర్శకుడైన నెల్సన్ దిలీప్ కుమార్.. ఈ స్క్రిప్టులోనూ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కానీ, చిత్రీకరణలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, పూర్తి స్వేచ్చనిచ్చారన్నారు.
తొలి షెడ్యూల్ మైసూరులో పూర్తి చేయగా, రెండో షెడ్యూల్ చెన్నైలో చిత్రీకరించాం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకునే రీతిలో హీరోయిన్ లేదు. కానీ, కథ డిమాండ్ మేరకు ఒక నటి ప్రధాన పాత్ర పోషించారు. బిచ్చగాడి వేషంలో కెవిన్‌ను ఐదారు విధాలుగా టెస్ట్ చేశాం. ఓ వేషంలోనే కెవిన్ రోడ్డుపై నిజంగానే భిక్షాటన చేయగా, ఎవరూ గుర్తుపట్టలేదు.
పైగా ఓ మహిళ రూ.20 కూడా వేశారు. సో.. ఈ లుక్‌లో బెగ్గర్‌గా సరిగ్గా సరిపోయాడని భావించి దాన్నే ఖరారు చేశాం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దర్శకుడుగా నా తొలి చిత్రం. దీపావళికి విడుదల చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.