Coolie: ర‌జ‌నీకాంత్, లోకేశ్ క‌న‌గ‌రాజ్‌‘కూలీ’కి.. ఇళ‌య‌రాజా నోటీసులు

ABN , Publish Date - May 01 , 2024 | 06:55 PM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న‌ చిత్రం కూలీకి పెద్ద షాక్ త‌గిలింది. నా పాట‌ను వాడుకున్నారంటూ ఇళ‌య‌రాజా స‌త‌రు నిర్మాత‌కు నోటీసులు పంపారు.

Coolie: ర‌జ‌నీకాంత్, లోకేశ్ క‌న‌గ‌రాజ్‌‘కూలీ’కి.. ఇళ‌య‌రాజా నోటీసులు
ilayaraja

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) సౌత్ సెన్షేష‌న‌ల్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న‌ ర‌జ‌నీ 171 చిత్రం కూలీ (Coolie). హిందీ, తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల నుంచి చాలా మంది స్టార్లు కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమా ఇటీవ‌ల ప్రారంభ‌మ‌వ‌డ‌మే కాక వారం రోజుల క్రితం టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మిస్తుండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

Coolie.jpg

అయితే ఇప్పుడు ఈ టీజ‌రే వారికి కూలీ (Coolie) సినిమా టీమ్‌కు కొత్త‌ త‌ల‌నొప్పిని తీసుకువ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్‌లో నా అనుమ‌తి లేకుండా నా పాట‌ను వాడుకున్నార‌ని అంతేగాక కాఫీ రైట్ చ‌ట్టాన్ని ఉల్లంఘించారంటూ ఇళ‌య‌రాజా (Ilayaraja) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 1983లో రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘తంగ మగన్’ కోసం ఇళయరాజా స్వర పరిచిన‌ “వా వా పక్కం వా” పాటను తాజాగా ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టిస్తున్న కూలీ (Coolie) సినిమా టైటిట్‌ను ప్ర‌క‌టిస్తూ రిలీజ్ చేసిన టీజ‌ర్ (Coolie Title Teaser)లో ఉప‌యోగించారు.


దీంతో మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స‌ద‌రు మేక‌ర్స్‌పై సిరీయ‌స్ అవుతూ కూలీ (Coolie) చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) కు నోటీసులు పంపించారు. చిత్రంలో అనుమ‌తి లేకుండా నా పాట వాడినందుకు ఇప్ప‌టికైని వారు నా అనుమ‌తి తీసుకోవాల‌ని లేదా ఆ ప్రోమోలో స‌ద‌రు గీతాన్ని తొల‌గించాల‌ని.. లేకుంటే రాయ‌ల్టీ చెల్లించాలంటూ కోరిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మేక‌ర్స్ స్పందించ‌కుంటే కోర్టుకు ద్వారా లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో న్యూస్ బాగా వైర‌ల్ అవుతోంది.

ilayaraja.jpg

ఇప్ప‌టికే ఇళ‌య‌రాజా (Ilayaraja)కు చెందిన ఇలాంటి రాయ‌ల్టీకి సంబంధించిన ఓ నాలుగైదు కేసులు మ‌ద్రాస్ హైకోర్టులో న‌డుస్తుండ‌గా తాజాగా ఇప్పుడు ఈ కేసు వ‌చ్చి చేరింది. ఆ పాత రాయ‌ల్టీ కేసుల విష‌యంలో నిర్మాత‌కు, పాట‌లు వ్రాసిన వారికి కూడా ఉంటాయి అంతేగాని సంగీత ద‌ర్శ‌కుడికి పూర్తి హ‌క్కులు ఉండ‌వంటూ ఇళ‌య‌రాజా (Ilayaraja) కు వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - May 01 , 2024 | 06:58 PM