Jailer 2: దర్శకుడు ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:05 PM

తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilip kumar) తెరకెక్కించిన ‘జైలర్‌’ (Jailer) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! 

తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilip kumar) తెరకెక్కించిన ‘జైలర్‌’ (Jailer) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే!   బాక్సఫీస్  వద్ద  కాసుల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపుగా పార్ట్‌-2 రానున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. దర్శకుడు ఇప్పుడు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘‘జైలర్‌ 2’ (jailer 2)స్క్రిప్ట్  రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ ఒక నెలలోనే దీని గురించి ఓ భారీ ప్రకటన చేయనుంది. దాని కోసం అందరూ వేచి ఉండండి’ అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రారంభమవుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు నెల్సన్‌ కామెంట్స్‌తో ఈ తేదీనే ‘జైలర్‌ 2’ ప్రారంభం కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో రిలీజైన ‘జైలర్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకొని రూ.700 కోట్లు వసూళ్లు చేసింది. రజనీకాంత్‌  స్క్రీన్   ప్రెజెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. దీంతో దీని సీక్వెల్‌లో ఆయన ఎలా కనిపించనున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనితోపాటు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’లో నటిస్తున్నారు.


Updated Date - Sep 02 , 2024 | 04:11 PM