Kaatera -Ott: కాటేరా ఇప్పుడు మరో రెండు భాషల్లో..
ABN , Publish Date - Apr 15 , 2024 | 01:12 PM
1970లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కాటేరా’. దర్శన కథానాయకుడు. మాలాశ్రీ కుమార్తె ఆరాధనా రామ్ కథానాయికగా తెరంగేట్రం చేశారు.
1970లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కాటేరా’(Kaatera).
దర్శన్ కథానాయకుడు. మాలాశ్రీ కుమార్తె ఆరాధన రామ్ (Ardhana ram) కథానాయికగా తెరంగేట్రం చేశారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ సుధీర్ (Tarun Sudheer) దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 29న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆదివారం నుంచి ‘కాటేరా’ తెలుగు, తమిళ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు.