Star Director: స్టార్ డైరెక్టర్ సూసైడ్‌లో ట్విస్ట్.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
ABN , Publish Date - Nov 03 , 2024 | 09:49 PM
కన్నడ స్టార్ డైరెక్టర్ గురుప్రసాద్ సూసైడ్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
'మఠ', 'ఎద్దేలు మంజునాథ' సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో సంచలన విజయాలు అందుకున్న డైరెక్టర్ 'గురుప్రసాద్'. ఈరోజు ఆయన మదనాయకనహళ్లిలోని తన నివాసంలో సూసైడ్ చేసుకొని కనిపించారు. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కేసును దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టినా పోలీసులు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో అందరు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
గురుప్రసాద్ మూడు లేదా నాలుగు రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. బాడీ కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి సమాచారమిచ్చారు. అపార్ట్‌మెంట్‌ని భార్య సుమిత్ర సమక్షంలో తెరిసిన పోలీసులు వివిధ సాక్ష్యాలను సేకరించారు. గురుప్రసాద్ రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఉరి వేసుకొని చనిపోయినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయి. మద్యంలో విషం కలుపుకోవడంతో రక్తపు వాంతులు వచ్చినట్లు భావిస్తున్నారు. ఆ నొప్పి భరించలేక ఉరి వేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సూసైడ్ చేసుకున్న ఫ్లాట్‌ని సీజ్ చేసిన పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించడంతో ఫ్లాట్‌ని సీజ్ చేసిన పోలీసులు ఇతరులను లోపలి రాకుండా రెస్ట్రిక్ట్ చేసి ఆధారాలను సేకరించారు, శరీరంలో నుండి లిక్విడ్ లీకేజ్ కావడంతో శరీరం కుళ్లిపోయి దూర్వాసన వచ్చిందని ప్రాథమిక సమాచారం
'మఠ', 'ఎద్దేలు మంజునాథ' సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో సంచలన విజయాలు అందుకున్న డైరెక్టర్ 'గురుప్రసాద్'. కెరీర్ ఆరంభంలోనే మంచి సినిమాలతో తనదైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డైరెక్టర్.. 'ఎద్దేలు మంజునాథ' సినిమాకి ప్రతిష్టాత్మక స్టేట్ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ నటించిన 'హుడుగరు', ఉపేంద్ర 'సూపర్ రంగా', 'విజిల్' సినిమాలకు ఆయన డైలాగ్స్ అందించారు. ఇక 'మఠ', 'ఎద్దేలు మంజునాథ','హుడుగరు', 'జిగర్తాండ', 'అనంతు వర్సెస్ నుస్రత్', 'బడవా రాస్కెల్', 'మైలారి' మొదలగు చిత్రాలలో నటుడిగా మెప్పించారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. 52 ఏళ్లకే మరణించడంతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.