Kantara: Chapter 1: త్వరలో ప్రత్యేక సెట్‌కి కాంతార చాప్టర్‌-1

ABN , Publish Date - May 04 , 2024 | 10:06 AM

‘కాంతార’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ చిత్రం  జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దర్శకుడు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ తెరకెక్కించనున్నారు.

Kantara: Chapter 1: త్వరలో ప్రత్యేక సెట్‌కి కాంతార చాప్టర్‌-1

‘కాంతార’ (Kantara) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ చిత్రం  జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దర్శకుడు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ (Kantara: Chapter 1)తెరకెక్కించనున్నారు. రిషబ్‌ హీరోగా (Rishab Shetty) నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కొద్ది రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ మొదలు కానుందని శాండల్‌వుడ్‌ నుంచి సమాచారం. ఇందుకోసం కుందాపురలోని తీర ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేసింది చిత్ర బృందం.

Kantara-2.jpg

దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కుందాపుర పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోనూ.. అక్కడ నిర్మించిన సెట్‌లోనూ కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్‌శెట్టితోపాటు మిగిలిన ప్రధాన తారాగణం కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. రిషబ్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాంతార 2 ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

Dasari Narayana Rao : దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ

Read More: Tollywood, Cinema news

Updated Date - May 04 , 2024 | 12:45 PM