VIjay - Trisha: సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ ఎందుకు?

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:17 PM

కోలీవుడ్‌లో విజయ్‌, త్రిషల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ నాలుగు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. కొంతగ్యాప్‌ తర్వాత గతేడాది 'లియో’తో మరోసారి జతకట్టారు.

VIjay - Trisha: సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ ఎందుకు?

కోలీవుడ్‌లో విజయ్‌(Vijay), త్రిషల (Trisha) వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ నాలుగు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. కొంతగ్యాప్‌ తర్వాత గతేడాది 'లియో’తో మరోసారి జతకట్టారు. పొలిటికల్‌ ఎంట్రీకి సిద్దమవుతోన్న విజయ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న నేపథ్యంలో, తన చివరి సినిమాలో త్రిషనే హీరోయిన్‌ గా నటిస్తుందనే ప్రచారం కోలీవుడ్‌లో నడుస్తోంది. తాజాగా విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఓ  ఫోటోను పంచుకుంది. అయితే త్రిష, విజయ్‌ కలిసి ఉన్న మరిన్ని  ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లారంటూ కొన్ని ఫోటోలను షేర్‌ చేస్తున్నారు నెటిజన్స్ . (Affair between Trisha and vijay)

Trisha.jpg

తాజాగా  విజయ్‌ ఒంటరిగా షూస్‌ వేసుకుని ఉన్న ఫోటోతో పాటు, త్రిష ఒంటరిగా ఉన్న ఫోటోలో అదే కలర్‌ షూ ధరించిన విజయ్ ఫోటోను  జత చేసి రకరకాల కథలు అల్లుతున్నారు. ఇద్దరి మధ్య సీక్రెట్‌ ఎఫైర్‌ నడుస్తుందని చర్చ లేవనెత్తారు. 'లియో' చిత్రీకరణ నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పటి తీసుకున్న ఫొటోలను వైరల్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అని కొందరు నిలదీస్తున్నారు. 

Vijay.jpg

విజయ్‌ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి  ఒక కొడుకు  ఉన్నాడు. ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని.. కొన్ని నెలలుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విజయ్‌, త్రిషల  మధ్య  వ్యవహారం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మరి విజయ్‌, త్రిష ఎలా స్పందిస్తారో చూడాలి. 

Vijay-2.jpg

Updated Date - Jun 25 , 2024 | 12:24 PM