RIP Producer Dilli babu: రాక్షసన్ నిర్మాత ఢిల్లీ బాబు ఇకలేరు

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:45 PM

తమిళ సినిమా(kollywood) పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. యాక్సెస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించిన నిర్మాత ఢిల్లీ బాబు (Producer Dillibabu) అనారోగ్యంతో కన్నుమూశారు.

తమిళ సినిమా (kollywood) పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. యాక్సెస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించిన నిర్మాత ఢిల్లీ బాబు (Producer Dillibabu) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన సెప్టెంబర్‌ 9 తెల్లవారుజామున సుమారు 12.30 గంటలకు తుది శ్వాస విడిచారు. డిల్లీ బాబు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరుగుతాయని సన్నిహితులు తెలిపారు. విష్ణు విశాల్‌ నటించిన రాక్షసన్‌ (తెలుగులో రాక్షసుడు) , ఓ మై కడవులే’ (Oh my kadavule) తెలుగులో ఓరి దేవుడాగా  రీమేక్‌ అయ్యాయి, అలాగే జీవీ ప్రకాష్‌ హీరోగా వచ్చిన బ్యాచ్‌లర్‌, మిరల్‌, మరకతమణి వంటి చిత్రాలను నిర్మించారు.

కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం లో ముందు ఉండేవారు ఢిల్లీ బాబు. ఆయన నిర్మాణంలో దర్శకులుగా పరిచయమైనా దర్శకులు అగ్ర దర్శకులుగా మారారు. అయన  అకాల మరణం యావత్‌ సినీ వర్గాలను, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణ వార్త తెలియగానే తోటి నిర్మాతలు, నటుడు, దర్శకులు సంతాపాన్ని తెలియజేస్తూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Updated Date - Sep 09 , 2024 | 04:56 PM