Lokesh Kanagaraj: ఒకే ఫ్రేములో.. రజనీకాంత్, కమల్‌ హాసన్ చాన్స్ మిస్స‌యింది

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:52 AM

కరోనా కారణంగా ఇద్దరు అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్‌ హాసన్ లను ఒకే ఫ్రేములో డైరెక్ట్‌ చేసే గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టు యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్ వెల్లడించారు.

lokesh

కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరు అగ్రహీరోలైన రజనీకాంత్ (Rajinikanth), కమల్‌ హాసన్ (Kamal Hassan)లను ఒకే ఫ్రేములో డైరెక్ట్‌ చేసే గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టు యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్ (lokesh kanagaraj) వెల్లడించారు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘లియో’ (LEO) వంటి బంపర్‌ హిట్‌ మూవీలకు దర్శకత్వం వహించిన లోకేష్‌. ఇపుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (coolie) చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ‘ఖైదీ-2’ను ప్రారంభించనున్నారు.

Lokesh.jpg

ఈ నేపథ్యంలో తన ఎల్‌సీయు (లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌) నుంచి వచ్చే ప్రాజెక్టులను ఆయన వివరించారు. ‘కరోనా మహమ్మారి రాకుండా ఉండి ఉంటే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ నటించాల్సిన చిత్రానికి దర్శకత్వం వహించే గొప్ప అవకాశం దక్కివుండేది. కరోనా కారణంగా ఇది చేజారిపోయింది.

Coolie.jpg

ఆ తర్వాత కమల్‌ హాసన్‌ కోరిక మేరకు ‘విక్రమ్‌’ డైరెక్ట్‌ చేశాను. ఎల్‌సీయూలో మొత్తం 10 చిత్రాలుంటాయి. ‘విక్రమ్‌’లోని రోలెక్స్‌ పాత్రను ప్రత్యేక చిత్రంగా రూపొందిస్తాను. విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్ళకపోయి ఉంటే ‘లియో-2’(LEO2)ను రూపొందించే వాడిని. ఇప్పుడు ‘విక్రమ్‌-2’ (vikram2) తెరకెక్కించి ఎల్‌సీయూకి ముగింపు పలుకుతాను’ అని పేర్కొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:52 AM