Suresh Gopi: సురేష్ గోపి సంచలనం.. కేరళ నుంచి చరిత్ర సృష్టించిన నటుడు
ABN , Publish Date - Jun 05 , 2024 | 10:48 AM
మలయాళ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వ్యక్తిగా రికార్డులోకెక్కాడు.
మలయాళ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి (Suresh Gopi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election) విజయం సాధించి దేశంలోనే మొట్ట మొదటి సారిగా కేరళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా పార్టమెంట్‌లో అడుగు పెట్టబోతున్న వ్యక్తిగా రికార్డులోకెక్కాడు. 2016లో ఫస్ట్ టైం రాష్ట్రపతి ద్వరా రాజ్యసభకు నామినేట్ చేయబడిన సురేష్ గోపి ఆ తర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమై ఓటమి చెందారు. ఆ వెంటనే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి సంచలనం సృష్టించారు.
1952 లో మొదలైన లోక్‌సభ ఎన్నికలు 2024 వరకు మొత్తంగా 18 సార్లు ఎలక్షన్స్ జరిగినప్పటికీ జన్ సంఘ్ నుంచి గానీ జనతా పార్టీ నుంచి గానీ ప్రస్తుత బీజీపీ (BJP) నుంచి గానీ కేరళలో ఎప్పుడు విజయం సాధించిన అనవాళ్లు లేవు. ఫస్ట్ టైం సురేష్ గోపి (Suresh Gopi) ఆ ఘనత సాధించాడు. అంతేగాక కేంద్రంలోనూ మరోసారి బీజేపీ ప్రభుత్వమే ఉంటుండడంతో సురేష్ గోపి (Suresh Gopi)కి మంచి ప్రాధాన్యత ఉన్న మంత్రి పదవి దక్కవచ్చనే వార్తలు అప్పుడే చక్కర్లు కొడుతున్నాయి.