Mohan Lal: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. మోహన్ లాల్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:20 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన సృష్టించిన 'హేమ కమీటీ రిపోర్ట్' తర్వాత 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్' అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన 'అమ్మ' అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన ఏమన్నారంటే..

మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'హేమ కమీటీ రిపోర్ట్' దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్' (అమ్మ) అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన 'అమ్మ' అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మోహన్ లాల్ ఏమన్నారంటే..


మోహన్ లాల్ మాట్లాడుతూ.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. అవి కేవలం వదంతులు మాత్రమేనన్నారు. అంతేకాకుండా ఆ అసోసియేషన్‌కు సంబంధించి ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.


గతంలో మోహన్ లాల్ మాట్లాడుతూ.. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో కకావికలం చేస్తోంది. దీంతో అన్ని పరిశ్రమల నుంచి ఇబ్బందులకు గురవుతున్న మహిళలు దైర్యంగా గొంతెత్తుతున్నారు. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ను లక్ష్యంగా చేసుకోవద్దని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు. అన్ని ప్రశ్నలకు ‘అమ్మ’ సమాధానం చెప్పడం సాధ్యం కాదన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేేస పరిశ్రమ అని చెప్పారు. ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2024 | 06:20 PM