Mamta Mohandas: ఒత్తిడితో కూడిన బంధంతో పనిలేదు!

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:22 PM

మమతా మోహన్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె కథానాయికే కాదు చక్కని గాయని కూడా. తెలుగులో ఎన్నో హిట్‌ చిత్రాల్లో పాటలు పాడారు. రాఖీ చిత్రంలో  టైటిల్‌ సాంగ్‌తో తెలుగులో గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 'యమదొంగ’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

Mamta Mohandas: ఒత్తిడితో కూడిన బంధంతో పనిలేదు!

మమతా మోహన్ దాస్ (Mamta mohandas) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె కథానాయికే కాదు చక్కని గాయని కూడా. తెలుగులో ఎన్నో హిట్‌ చిత్రాల్లో పాటలు పాడారు. రాఖీ చిత్రంలో  టైటిల్‌ సాంగ్‌తో తెలుగులో గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 'యమదొంగ’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా తర్వాత ఈ మలయాళీ కుట్టి వరుస అవకాశాలు అందుకొని దక్షిణాది భాషలన్నింటిలోనూ యాక్ట్‌ చేశారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి ‘మహారాజా’తో సందడి చేసేందుకు సిద్థమయ్యారు. 2011లో ఆమె ప్రజిత్   పద్మనాభన్ ను  వివాహం చేసుకుంది. అయితే ఏడాదిలోపే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డేటింగ్‌పై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు.

‘‘లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ, మా బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. జీవితంలో రిలేషన్‌ ఉండాలి.. కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని నేను కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరి జీవితానికి కచ్చితంగా ఒక తోడు అవసరం అని భావించడం లేదు. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నా.. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి’’ అన్నారు.

Mamta.jpg

కెరీర్‌ గురించి మాట్లాడుతూ ‘‘మలయాళీ చిత్రపరిశ్రమలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పోషించిన ఎన్నో పాత్రలకు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగు, తమిళ బాషల్లోనూ స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశం దక్కింది.  బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి, గౌరీ ఖాన్‌ ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని మమతా మోహన్‌ దాస్‌ అన్నారు. గత ఏడాది ఐదు చిత్రాలతో సందడి చేసిన మమతా ప్రస్తుతం ‘మహారాజా’ ప్రచారంలో బిజీగా ఉన్నారు.
                                                                                                                                                                                              

Updated Date - Jun 13 , 2024 | 03:22 PM