Rajinikanth: 33 ఏళ్ల తర్వాత ఈ కాంబో సాధ్యమేనా?

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:18 PM

ఈ వయస్సులోనూ ఆయన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పలు జాతీయ అవార్డులు కొల్లగొట్టాడు. నెక్స్ట్ లోకనాయకుడు కమల్ హాసన్‌(Kamal Haasan)తో తగ్‌లైఫ్(Thug Life) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లెజండరీ కాంబో కోసం ఫాన్స్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తుండగానే మరో వార్త ఫ్యాన్స్‌ని తబ్బిఉబ్బిపోయేలా చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..

maniratnam

సౌత్ సినిమా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిన లెజెండరీ దర్శకులు రాంగోపాల్ వర్మ(RGV), మణిరత్నం(Mani Ratnam). వీరిద్దరూ తమదైన సినిమాలతో కేవలం సౌత్‌లోనే కాకుండా ఇండియా వైడ్‌గా ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. భారతీయ సినిమాని అంతర్జాతీయ ప్రామాణాలతో తక్కువ బడ్జెట్‌లోనే చేసి తమ అసాధారణ ప్రతిభని చూపించారు. రాంగోపాల్ వర్మ కాస్త సినిమాలు తగ్గించగా మణిరత్నం మాత్రం వరుసగా తన మార్క్ సినిమాలు చేస్తూ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాడు. ఈ వయస్సులోనూ ఆయన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పలు జాతీయ అవార్డులు కొల్లగొట్టాడు. నెక్స్ట్ లోకనాయకుడు కమల్ హాసన్‌(Kamal Haasan)తో తగ్‌లైఫ్(Thug Life) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లెజండరీ కాంబో కోసం ఫాన్స్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తుండగానే మరో వార్త ఫ్యాన్స్‌ని తబ్బిఉబ్బిపోయేలా చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..


మణిరత్నం ఈ దర్శకుడితో ఒక్క సినిమానైనా చేయాలని ఎందరో దిగ్గజా నటులు భావిస్తుంటారు. ఇదంతా పక్కనపెడితే ఆయన సినిమా కోసం గ్లోబల్‌గా వెయిట్ చేసే ఆడియెన్స్ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎవరితో సినిమాలు చేస్తున్నాడని నిత్యం సెర్చ్ చేస్తుంటారు. అలాంటిది ఆయన కమల్‌తో పాటు మరో లెజండరీ యాక్టర్‌తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 33 ఏళ్ల క్రితం మణిరత్నం.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తీసిన 'దళపతి'(Dalapathy) సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ సినిమాలోని పాటలకు, సన్నివేశాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 12న రజినీ 75వ పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో ఇటు రజినీతో పాటు మణిరత్నం ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.


ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్‌’ అక్టోబర్‌ 10న విడుదలకానుంది. ఇటీవల జరిగిన సినిమా ఆడియో వేడుకలో రజనీ పాల్గొన్నారు. అనిరుధ్‌తో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు.

Updated Date - Oct 06 , 2024 | 03:18 PM