Onam Festival: ఓనమ్ అగోషమ్.. సినీ తారలు ఏం చేశారో చూడండి
ABN , Publish Date - Sep 15 , 2024 | 08:26 PM
కేరళ ప్రజలకు ఓనమ్ (Onam Festival) ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివరివారం లేదా సెప్టెంబర్ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
కేరళ ప్రజలకు ఓనమ్ (Onam Festival) ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివరివారం లేదా సెప్టెంబర్ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. 10 రోజుల పాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ పండుగ ఈ నెల 6న మొదలైంది. 15వ తేదిన తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తవుతుంది.
పది రోజులకు పైగా జరిగే ఈ పండుగలో మలయాళ మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని ‘పూకోళం’ అంటారు.
అదే రోజు వామన, మహాబలిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున మలయాళీలు ప్రతి ఇంట చేసే ‘ఓనసద్యా’ అనే విందు చాలా ముఖ్యమైనది.
ఓనమ్ (Onam - 2024) ప్రారంభం నుంచి మలయాళీ భామలు, తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణిస్తున్న కథానాయికలు ఈ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించుకుంటున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఓనమ్ అగోషం (సెలబ్రేషన్స్) అంటూ నెట్టింట్లో ఫొటోలతో సందడి చేశారు.
కథానాయికలు అనుపమా పరమేశ్వరన్, కల్యాణి ప్రియదర్శిన్, మంజిమా మోహన్, మాళవిక మోహనన్, మంజిమా మోహన్, పూర్ణ, ప్రియా ప్రకాశ్ వారియర్, మమితా బైజు, రుక్సార్ థిల్లాన్, సంప్రదాయ దుస్తులు ధరించి కనులవిందు చేశారు.
కళ్యాణి ప్రియదర్శన్ కుటుంబం
దుల్కర్ సల్మాన్
మంజిమ మోహన్