Chennai City Gangsters: డబ్బు కోసం సినిమాలు తీయడం లేదు

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:52 PM

డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమాలు తీయడం లేదని, రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులున్నారని అలాంటి వారిని గుర్తించి ఇండస్ట్రీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ‘చెన్నై గ్యాంగ్‌స్టర్స్‌’నిర్మాత బాబీ బాలచంద్రన్‌ అన్నారు.

vaibhav

డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమాలు తీయడం లేదని, రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులున్నారని అలాంటి వారిని గుర్తించి ఇండస్ట్రీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు నిర్మాత బాబీ బాలచంద్రన్‌ అన్నారు. తాజాగా ఆయ‌న బీటీజీ యూనివర్శల్ (BTG Universal) పతాకంపై నిర్మించిన చిత్రం ‘చెన్నై గ్యాంగ్‌స్టర్స్‌’(Chennai City Gangsters). ప్ర‌ముఖ తెలుగు ద‌ర్శ‌కుడు కొదంగ‌రామిరెడ్డి కుబారుడు త‌మిళ స్టార్ ఆగ్ర న‌టుడు వైభవ్ (Vaibhav) హీరోగా, అతుల్యరవి (Athulyaa Ravi) క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఆనంద్‌రాజ్ (Anand Raj), జాన్‌ విజయ్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, సునీల్‌ రెడ్డి, మొట్టైరాజేందన్‌, ఇళవరసు, లివింగ్‌స్టన్‌, మణికంఠన్‌ రాజేష్‌ తదితరులు నటించిన చిత్రం దర్శకత్వం విక్రమ్‌ రాజేశ్వర్ (Vikram Rajeshwar), అరుణ్‌ కేశవ్‌. సంగీతం డి.ఇమ్మాన్‌.

GJvHuZBXIAAr2Il.jpeg

ఈ చిత్రం ట్రైలర్‌, ఆడియో ఇటీవ‌ల‌ విడుదల చేశారు.ఈ సంద‌ర్భంగా నిర్మాత బాబీ బాలచంద్రన్‌ మాట్లాడుతూ.. ‘తమ బ్యానర్‌పై నిర్మించిన ‘డిమాంటీ కాలనీ-2’ ఈ నెల 15వ తేదీన విడుదల చేయగా ప్రేక్షకులు ఆదరించి తొలి సక్సెస్‌ అందించారు. ఇది రెండో చిత్రం. మూడో చిత్రాన్ని అరుణ్‌ విజయ్‌తో నిర్మిస్తున్నాం. అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న మేము సొంత రాష్ట్రంలో కొందరికైనా ఉపాధి కల్పించాలన్న భావనతో సినిమా రంగాన్ని ఎంచుకున్నామ‌న్నారు. ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి, తమ సంస్థ ద్వారా అవకాశాలు కల్పిస్తామ‌న్నారు.


GVP25MvXMAAOvZl.jpeg

హీరో వైభవ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఒక ఫన్‌ ప్యాక్ట్‌ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్‌ చేసేలా సినిమా ఉంటుందన్నారు. దర్శకుడు విక్రమ్‌ రాజేశ్వర్‌ మాట్లాడుతూ, ‘తొలిసారి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. మీడియాతో ప్రేక్షకుల సపోర్టు కోరుతున్నాను’ అన్నారు. హీరోయిన్‌ అతుల్య రవి మాట్లాడుతూ, ‘వైభవ్‌ సరసన నటించడం సంతోషంగా ఉంది. నిర్మాత మరిన్ని సినిమాలు తీస్తూ మరింతమదికి అవకాశాలివ్వాలి’ అని కోరారు. సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా పాటలతో సంగీతం బాగా వచ్చింది. ఫన్‌ రైడ్‌ మూవీ. వైభవ్‌తో కలిసి మూడో చిత్రానికి పనిచేశాను. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 06:52 PM