Nayanathara: నన్ను గొప్ప మహిళగా మార్చావు!

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:33 AM

కొద్దిరోజులుగా విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan), లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanthara)విడిపోతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం (shuts down divorce rumours) తెలిసిందే.

Nayanathara:  నన్ను గొప్ప మహిళగా మార్చావు!


కొద్దిరోజులుగా విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan), లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanthara)విడిపోతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం (shuts down divorce rumours) తెలిసిందే. పది రోజుల క్రితం నయన తన భర్త విఘ్నేష్‌ శివన్ ను  ఇన్స్టాగ్రామలో  అన్ ఫాలో  కావడం, ‘నేను సర్వం కోల్పోయాను’ అని పోస్ట్‌ పెట్టడం. మళ్లీ దాన్ని డిలీట్‌ చేయడం అందుకు కారణం. తర్వాతి రోజు మళ్లీ తన భర్త ఖాతాను ఫాలో కావడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. అయినా సోషల్‌ మీడియాలోని కొందరు ఆకతాయిలు మాత్రం ఆ వార్తలు ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. తాజాగా నయన్ ఈ గాసిప్‌లకు మరోసారి చెక్‌ పెట్టింది. ప్రస్తుతం నయన్  దంపతులు తమ పిల్లలతో కలిసి విహారంలో ఉన్నారు. సౌదీ అరేబియా వెళ్లిన ఈ జంట అక్కడి ఫొటోలను   ఇన్ స్టాలో  షేర్‌ చేశారు. సౌదీలోని ఎఫ్‌1 కార్‌ రేసింగ్‌ను వీక్షిస్తూ ఈ జంట ఆనందిస్తున్నారు. ఈ ఫొటోలను నయనతార ఇన్ స్టా  స్టోరీలో పోస్ట్‌ చేసింది. విఘ్నేష్‌  కూడా నయన్  ఫొటోలు షేర్‌ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘నన్ను ఇంత గొప్ప మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు’ అంటూ హార్ట్‌ ఎమోజీలు పెట్టారు. దీంతో విడాకుల రూమర్స్‌కు మరోసారి చెక్‌ పెట్టినట్లయింది.

Nayan.jpg

గతేడాది ‘జవాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. షారుక్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో నయనతార  బాలీవుడ్‌లో మంచి మార్కులు సంపాదించారు. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఆర్‌.మాధవన, సిద్థార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో నయన కనిపించనున్నారు.

Nayana.jpg

Updated Date - Mar 09 , 2024 | 12:10 PM