Vettaiyan: బిగ్‌బీ, తలైవా కలిసిన వేళ..

ABN , Publish Date - May 03 , 2024 | 05:36 PM

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ టైటిల్‌ పాత్రలో 'జై భీమ్‌’ ఫేమ్‌ టీ.జే.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’.  లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్  పాన్  ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Vettaiyan: బిగ్‌బీ, తలైవా కలిసిన వేళ..


సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) టైటిల్‌ పాత్రలో 'జై భీమ్‌’ ఫేమ్‌ టీ.జే.జ్ఞానవేల్‌ (T. J. Gnanavel) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’.  లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్  పాన్  ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్  కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! తాజాగా ఆయన సెట్‌లో అడుగుపెట్టారు. రజనీకాంత్, అమితాబ్‌ (Amitabh Bachchan) సూట్స్‌ ధరించి హుందాగా మాట్లాడుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పక్కా యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. ఫహాద్‌  ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికాసింగ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Rajinikanth  (3).jpeg

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.ఆర్‌. కతీర్‌ ఐ.ఎస్‌.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Rajinikanth  (1).jpeg

Updated Date - May 03 , 2024 | 05:44 PM