Rajinikanth: ఆస్పత్రిలో రజనీకాంత్.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Oct 01 , 2024 | 09:58 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth -73) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth -73) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రజనీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో కూడా ఆస్పత్రిలో చేరినట్లు, మంగళవారం రజినీకి డా. సతీష్ ఆదర్వంలో ఎలక్టివ్ ప్రొసీజర్ షెడ్యూల్ చేసినట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ వేట్టయాన్, కూలీ (Coolie) చిత్రాల్లో రజనీ నటిస్తున్నారు. వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది.