Lal Salaam: గాడ్‌ ఆఫ్‌ స్క్రీన్ ప్రజెన్స్.. వేరే లెవల్‌ అసలు..!

ABN , Publish Date - Feb 09 , 2024 | 12:16 PM

గత ఏడాది 'జైలర్‌' (Jailer) చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్ (Rajinikanth) కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఆ చిత్రం. అదే జోష్‌తో వరుస చిత్రాలు చేస్తున్నారు తలైవా. తాజాగా ఆయన నటించిన 'లాల్‌ సలామ్‌' (lal salaam) చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Lal Salaam: గాడ్‌ ఆఫ్‌  స్క్రీన్ ప్రజెన్స్.. వేరే లెవల్‌ అసలు..!

గత ఏడాది 'జైలర్‌' (Jailer) చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్ (Rajinikanth) కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఆ చిత్రం. అదే జోష్‌తో వరుస చిత్రాలు చేస్తున్నారు తలైవా. తాజాగా ఆయన నటించిన 'లాల్‌ సలామ్‌' (lal salaam) చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌గా రజనీకాంత్‌ కనిపించారు. కొంత గ్యాప్‌ తర్వాత ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya rajesh) దర్శకత్వంలో ఆయన నటించిన  చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలో సుభాస్కరణ్‌ నిర్మించారు. విష్ణు విశాల్‌ , విక్రాంత్‌ కీలక పాత్రల్లో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథిగా మెప్పించారు. ఈ సినిమాతో జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. పాన్  ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం. 

"మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది ఇదే అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మత సామరస్యం అన్న సున్నితమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా ఐశ్వర్య తెరకెక్కించిందని నెటిజన్లు తెలుపుతున్నారు. 'లాల్‌ సలాం' ఇచ్చిన  సందేశం అందరినీ మెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. రజనీకాంత్‌ ఎంట్రీ సీన్‌ మామూలుగా లేదని ఫాన్స్  చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎంట్రీ చూడలేదని అభిమానులు సంబరపడిపోతున్నారు. అందరికీ బాషా సినిమా గుర్తొస్తుందని చెబుతున్నారు. 'లాల్‌ సలాం' చిత్రంలో రజనీకాంత్‌ ప్రత్యేక పాత్రలో కనిపించినా కథలో పూర్తిగా ఆయనే ఆక్రమించేశాడని చెప్పవచ్చు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సినిమాకు అదనపు ఆక్షణగా నిలిచిందని రాసుకొచ్చారు ఓ నెటిజన్. ఆయన అందించిన బీజీఎమ్‌తో రజనీకాంత్‌ ఎలివేషన్‌ సీన్స్‌ పీక్స్‌కు చేరుకుంటాయని చెబుతున్నారు. 

Rajini.jfif

అయితే ఓ నెటిజన్ మాత్రం దర్శకురాలు ఐశ్వర్య కాస్త తడబడిందని చెప్పారు. లాల్‌ సలాం పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌. కానీ దానిని చెప్పడంలో ఐశ్వర్య కొంత వరకూ విఫలం అయ్యారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్‌ను చాలా తక్కువ సమయం చూపించారని అంటున్నారు. విష్ణు - విక్రాంత్‌ల సీన్లు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయని అంటున్నారు. ఎమోషనల్‌ కనెక్షన్  అంతగా లేదని, అది ఆడియన్స్ ని కొంత నిరాశ పరుస్తుందని చెబుతున్నారు. ఓ నెటిజెన్  అయితే ఒన వర్డ్‌ రివ్యూ అంటూ 3 రేటింగ్‌ ఇచ్చారు. రజనీ గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ స్క్రీన్ ప్రెజన్స్  అని తలైవాను పొగుడుతున్నారు. సెకెండాఫ్‌ సినిమా స్టాండర్డ్‌ని పెంచిందనీ, క్లైమాక్స్‌ టాక్‌ ఆఫ్‌ ద టౌన్ గా  నిలుస్తుందని ఓ అభిమాని ట్వీట్‌ చేశారు. 


Updated Date - Feb 09 , 2024 | 12:42 PM