Renu Desai: భారతీయుడు ఫ్లాప్‌.. చాలా సంతోషం!

ABN , Publish Date - Sep 08 , 2024 | 04:59 PM

కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఇచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే!


కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఇచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! దానికి కొనసాగింపుగా జూలై 12న విడులైన 'భారతీయుడు -2' (Bharateeyudu 2) చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్‌ Renudesai) సినిమా టీమ్‌పై ఫైర్‌ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అయితే ఆమె వ్యాఖ్యలకు కారణం ఉంది. ఈ సినిమాలో వీధి కుక్కలను హీనంగా చూసే  డైలాగ్‌ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్‌ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు  ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్‌ 2తో ట్రోలింగ్‌ బారిన పడ్డ శంకర్‌ తర్వాతి పార్ట్‌ విషయంలో అయినా జాగ్రత్త తీసుకుంటే మంచి రిజల్ట్‌ వస్తుందని నెటిజన్లు సూచిస్తున్నారు

Updated Date - Sep 08 , 2024 | 05:00 PM