Shruti Haasan: నాన్న.. ఇదీ నా కష్టం అని ఎన్నోసార్లు చెప్పాలనిపించింది!

ABN , Publish Date - Jul 29 , 2024 | 07:00 PM

నటిగా తెరంగేట్రం చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) చెప్పుకొచ్చారు. ముంబైలోని తన ఇంటిని పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. తల్లి సారికకు తండ్రి కమల్‌హాసన్‌ ఇచ్చిన తొలి బహుమతిని చూపించారు.

నటిగా తెరంగేట్రం చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) చెప్పుకొచ్చారు. ముంబైలోని తన ఇంటిని పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. తల్లి సారికకు తండ్రి కమల్‌హాసన్‌ ఇచ్చిన తొలి బహుమతిని చూపించారు. అది ఆమెకు ఎంతో ప్రత్యేకమన్నారు. ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టి 15 ఏళ్లు (15 years of Shruti Haasan) పూర్తయిన సందర్భంగా తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్ట్‌ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘కెరీర్‌ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా సినిమా గురించి ఓ పేపర్‌లో వచ్చిన రివ్యూ చూసి బాధపడ్డా. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే సినీ రంగాన్ని వదిలి వెళ్లిపోయేవారు. నేను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా. యాక్ట్‌ చేసిన ప్రతి సినిమా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. కమర్షియల్‌ చిత్రాల్లో నటించా. అందుకు సిగ్గుపడటం లేదు. అవి మంచి విజయాలు అందించాయి. (Film industry struggles)

Shruthi.jpg

నాకెంతో నచ్చి కష్టపడి వర్క్‌ చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద వర్కౌట్‌ కాలేదు. ఫిల్మ్‌ ఇండస్ర్టీ నాకొక ఇల్లు. ఇక్కడ బంధుప్రీతి ఎక్కువ. నా తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందినవారే. అందరూ నాకు బ్యాగ్రౌండ్‌ ఉంది గోల్డెన స్ఫూనతో పుట్టాను అనుకుంటారు. సినిమా జర్నీలో నా తల్లిదండ్రుల ఏమాత్రం సాయం చేయలేదు. ‘‘నాన్నా.. నాకు అవకాశాలు రావడం లేదు నేనేం చేయాలి?’’ అని చెప్పాలనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటిని నేనే ఎదుర్కొన్నా’’ అని శ్రుతిహాసన్‌ తెలిపారు. 

Shruthi-2.jpg

తను అందుకున్న అవార్డులను ప్రత్యేకంగా రూమ్‌లో దాచుకోవడం నచ్చదని.. అందుకే ఫ్రిడ్జ్‌పై పెట్టానని వాటిని చూసినప్పుడు తన వర్క్స్‌ గుర్తుకు వసాయని, తద్వారా స్ఫూర్తి పెరుగుతుందని శ్రుతీ అన్నారు. ‘బ్లాక్‌’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్‌.. ‘అనగనగా ఓ దీరుడు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘గబ్బర్‌సింగ్‌’తో సూపర్‌హిట్‌ అందుకుని ఐలెన్  లెగ్‌ పేరును గోల్డెన్ లెగ్‌గా మార్చుకున్నారు. అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేశారు. ఈ ఏడాది ఆమె ‘సలార్‌’తో అలరించారు. ప్రస్తుతం  ‘డకాయిట్‌’, ‘కూలీ’, ‘సలార్‌ 2’, ‘చెన్నై స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 07:00 PM