Rashmika Mandanna: శివ కార్తికేయన్‌కు జోడీగా..

ABN , Publish Date - Dec 09 , 2024 | 09:51 AM

‘పుష్ప 2’ విజయంతో పాన్‌ ఇండియాలో అదరగొట్టేస్తున్న రష్మికను ఇందులో నాయికగా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

'అమరన్‌’తో (Amaran) హిట్టు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నారు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan). ఇప్పుడాయన తన 24వ సినిమా చేయబోతున్నారు. శిబి చక్రవర్తితో (Sibi Chakravarthy} కలిసి ఈ సినిమా ప్రారంభించనున్నారు. ‘డాన్‌’ విజయం తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందనున్న రెండో చిత్రమిది. ప్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించనుంది. ‘పుష్ప 2’ విజయంతో పాన్‌ ఇండియాలో అదరగొట్టేస్తున్న రష్మికను ఇందులో నాయికగా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర విషయమై ఆమెతో సంప్రదింపులు జరిగాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో తను కూడా సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ వచ్చే నెల తొలి వారంలో మొదలయ్యే అవకాశముంది. అనిరుథ్థ్‌ సంగీతం అందిస్తున్న చిత్రమిది. శివ కార్తికేయన్‌ ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.  

'పుష్ప' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రస్తుతం తెలుగులో 'ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమితో బిజీగా ఉంది. దానితోపాటు కుబేర, ఛావా, సికందర్‌, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది. 

Updated Date - Dec 09 , 2024 | 09:51 AM