Suhasini: అంతా మారిపోయింది.. అందుకే స్కిన్‌ షోకి సై అంటున్నారు

ABN , Publish Date - Oct 27 , 2024 | 06:57 PM

సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం మారిందని, అలా జరగడానికి కారణమేంటో, ఎలా మారిందో చెప్పుకొచ్చారు సుహాసిని మణిరత్నం.

సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం మారిందని, అలా జరగడానికి కారణమేంటో, ఎలా మారిందో చెప్పుకొచ్చారు సుహాసిని (Suhasini) మణిరత్నం. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆమె మాట్లాడుతూ "కమర్షియల్‌ చిత్రాలకు సంబంధించి 2010 నుంచి ఎన్నో మార్పులు వచ్చాయి.  వెస్ట్రన్‌ కల్చర్‌కు మన సినిమా బాగా అలవాటు పడింది. ఆ ఫార్ములా ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే నేటి హీరోయిన్లు స్కిన్‌ షో (Skin show), ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడానికి ఇబ్బందిపడటం లేదు. గతంలో ఇలాంటి సీన్లలో నటించడానికి హీరోయిన్లు చాలా అరుదుగా అంగీకరించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఏదైనా చేస్తున్నారు’’ అని సుహాసిని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 

Suha.jpg

"హీరోలకు స్ట్రాంగ్ రోల్స్‌ రాస్తున్నారు. హీరోయిన్లకు మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తూ గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారు’’ అని సుహాసిని  అన్నారు.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అంతే కాదు తన భర్త మణిరత్నం గురించి మాట్లాడారు సుహాసిని. ‘‘మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి.. ఇలా ప్రతి విషయంలో పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య పెద్దగా గొడవలు జరగవు. చిన్న మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోతుంటాం. ఆయన సినిమాలకు నేను వర్క్‌ చేస్తుంటా. ‘రోజా’, ‘తిరుడా తిరుడా’, ‘ఇరువర్‌’, ‘రావణ’ చిత్రాలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేశా’’ అని తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 06:57 PM