Suriya: కిక్ ఎక్కించే అప్డేట్.. సూర్య 'రోలెక్స్' ఎలా ప్లాన్ చేశారంటే

ABN , Publish Date - Oct 18 , 2024 | 02:08 PM

సూర్య తన 'కంగువ' సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అయిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రోలెక్స్‌'పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..

Surya as Rolex

విక్రమ్‌ (Vikram) సినిమాలో రోలెక్స్‌ (Rolex) పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! కమల్‌ హాసన్‌ (kamal haasan) హీరోగా నటించిన ఈ చిత్రంలో రోలెక్స్‌గా సూర్య ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా యాక్ట్‌ చేశారు. తాజాగా సూర్య తన 'కంగువ' సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అయిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రోలెక్స్‌'పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..


‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanakaraj). గతంలో ఆయన మాట్లాడుతూ.. "‘విక్రమ్‌’ని అద్భుతంగా పూర్తి చేేసందుకు ‘రోలెక్స్‌’ సీన్స్‌ క్రియేట్‌ చేశా. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌ దృష్టిలో ఉంచుకుని ‘రోలెక్స్‌’పై ఒక స్టాండలోన్ మూవీ చేయాలనుకుంటున్నా" అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే 'కంగువ' ప్రమోషన్స్ లో సూర్య మాట్లాడుతూ.. ‘‘1986లో విడుదలైన ‘విక్రమ్‌’తో 2022లో వచ్చిన ‘విక్రమ్‌’కు ఏవిధంగా లింక్‌ ఉందో అదేవిధంగా ‘రోలెక్స్‌’కూ నేను నటించిన ఒక సినిమాతో కనెక్షన్‌ ఉంటుంది’’ అన్నారు. దీంతో హార్డ్‌కొర్ సూర్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..


ఇక ‘కంగువ’ (Kanguva) చిత్రానికి శివ దర్శకుడు. స్టూడియోగ్రీన్‌ పతాకంపై కె.ఈ జ్ఞానవేల్‌ రాజా (K. E. Gnanavel Raja) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం గురువారం ఉదయం ప్రకటించింది. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో సినీ ప్రియులు, సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారు. ఓ కొత్త కాన్సెప్ట్‌తో పది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్టోబర్‌ 10న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే అదే రోజున రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ రిలీజ్‌ ఉండటంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ఇటీవల ఓ కార్యక్రమంలో సూర్య పరోక్షంగా తెలిపారు.

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2024 | 02:21 PM