Vadivelu: సహ న‌టుడిపై.. వడివేలు పరువునష్టం దావా

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:31 AM

తన గురించి నిరాధారమైన ఆరోపణలు చేసిన సహ న‌టుడు సింగముత్తుపై హాస్య నటుడు వడివేలు పరువు నష్టం దావా వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన మద్రాస్‌ హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సింగముత్తుకు నోటీసులు జారీ చేసింది.

vadivelu

తన గురించి నిరాధారమైన ఆరోపణలు చేసిన సహ న‌టుడు సింగముత్తు (Singamuthu)పై హాస్య నటుడు వడివేలు (Vadivelu) పరువు నష్టం దావా వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన మద్రాస్‌ హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సింగముత్తు (Singamuthu)కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో వడివేలు (Vadivelu) దాఖలు చేసిన పిటిషన్‌లో ‘తాను ఇప్పటివరకు 300కు పైగా చిత్రాల్లోనటించాను.. సహ హాస్య నటుడు సింగముత్తుతో కలిసి 2000 సంవత్సరం నుంచి నటిస్తున్నా. నన్ను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు అన్నారు.

vadivel-singamuthu.jpg

దీంతో 2015 తర్వాత సింగముత్తుతో కలిసి నటించడం మానేశానని.. ఈ నేపథ్యంలో తాంబరంలో ఒక వివాదాస్పద స్థలాన్ని నాకు విక్రయించారు. దీనికి సంబంధించి సింగముత్తు (Singamuthu)పై పెట్టిన కేసు ఎగ్మోర్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలు యూట్యూబ్‌ చానెళ్ళకు ఇచ్చిన ఇంటర్యూల్లో సింగముత్తు నాపై అనేక ఆరోపణలు చేశారన్నారు. అత్యంత హీనంగా మాట్లాడారన్నారు.


Singamuthu a.jpg

ఈ వ్యాఖ్యలు ప్రజల్లో, అభిమానుల్లో నా పరువు ప్రతిష్టలను దిగజార్చేలా ఉన్నాయని.. అందువల్ల సింగముత్తు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే, ఇకపై నాపై అసత్య ప్రచా రం చేయకుండా నిషేఽధం విధించాలి’అని వడివేలు (Vadivelu) దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి న న్యాయమూర్తి ఆర్‌ఎండీ డీకారామన్‌.. కౌంటర్‌ దాఖలు చేయాలని సింగముత్తు (Singamuthu)కు నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Updated Date - Aug 23 , 2024 | 08:31 AM