ప్ర‌సాదంలో.. గర్భనిరోధక మాత్రలు కలపండి! ద‌ర్శ‌కుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. అరెస్ట్‌

ABN , Publish Date - Sep 24 , 2024 | 05:42 PM

ఓవైపు తిరుమ‌ల ల‌డ్డు ఇష్యూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉంటే తాజాగా త‌మిళ‌నాడులో ఓ సినిమా ద‌ర్శ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ను అరెస్టు చేసే వ‌ర‌కు వెళ్లాయి.

mohan

ఓవైపు తిరుమ‌ల ల‌డ్డు ఇష్యూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉంటే తాజాగా త‌మిళ‌నాడులో ఓ సినిమా ద‌ర్శ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ను అరెస్టు చేసే వ‌ర‌కు వెళ్లాయి. వివ‌రాల్లోకి వెళితే.. ద్రౌప‌తి, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్ వంటి త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో ఇండస్ట్రీలో అగ్ర‌ ద‌ర్శ‌కుడిగా గుర్తింపును ద‌క్కించుకున్నాడు డైరెక్ట‌ర్ జి.మోహన్ (Mohan G).

GYN_0SMakAYG6g8.jpeg

అయితే మోహన్‌ ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ప్ర‌సాదంగా చెప్పుకునే పంచామృతంపై తీవ్ర వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘పళని దేవాల‌యంలోని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి’ ఆంటూ ఆయ‌న అన్న మాట‌లు తీవ్ర దుమారం లేపాయి. దీంతో ప‌లువురు ఆయ‌న‌పై ఫిర్యాదు చేయ‌డంతో మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలో జి.మోహన్‌ను పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చికి తరలించారు.

phalani.jpg

Updated Date - Sep 24 , 2024 | 05:52 PM