Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజయ్ ఇంటికి మ‌రో లగ్జరీ కారు

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:34 PM

త‌మిళ అగ్రహీరో విజయ్‌ వినియోగిస్తున్న లగ్జరీ కార్ల జాబితాలో ఈ కొత్త కారు కూడా చేరింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

vijay

అగ్రహీరో విజయ్ (Thalapathy Vijay) మరో లగ్జరీ కారు కొనుగోలు చేసినట్టు కోలీవుడ్‌లో విస్తృతగా ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లు నిజం చేసేలా ఆయన నివాసం నుంచి ఒక లగ్జరీకారు వస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. విజయ్‌ వినియోగిస్తున్న లగ్జరీ కార్ల జాబితాలో ఈ కొత్త కారు కూడా చేరినట్టు సమాచారం.

ఆరు నెల‌ల క్రితమే ఓ కొత్త కారు BMW i7 X Drive 60 - New కొనుగోలు చేసిన ఆయ‌న ఇప్పుడు మ‌రో కొత్త కారును కొన‌డం ఇప్పుడు బాగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త కారు లెక్సస్‌ ఎల్‌ఎం మోడల్‌. దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఈ కారు ధర రూ.2 నుంచి రూ.2.50 కోట్లు(ఎక్స్‌ షోరూమ్‌) వరకు ఉండొచ్చని అంచనా. ఇందులో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. కాగా 2005లో అమెరికా నుంచి బీఎండబ్ల్యూ (సఫైర్‌ మెటాలిక్‌) మోడల్‌ కారు దిగుమతి చేసుకున్నారు.


vija.jpg

ఆ త‌ర్వాత 2012లో ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయిస్ ఘోష్ట్ కారును ఇంఫోర్ట్ చేసుకున్నారు. అయితే ఈ కారు దిగుమతి సుంకం చెల్లించే విషయంలో వివాదం చెలరేగింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో విజయ్ (Thalapathy Vijay) పన్ను చెల్లించక త‌ప్ప‌లేదు. ఇపుడు ఈ కారును ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచి తాజాగా లెక్సస్ (Lexus) ఎల్‌ఎంలగ్జరీ కారును ఆయన కొనుగోలు చేసినట్టు ప్రచారం సాగుతుంది.

Updated Date - Aug 14 , 2024 | 04:34 PM