Sathish: వారితో కామెడీ చేయించి.. నేను నటించా!

ABN , Publish Date - Feb 14 , 2024 | 10:16 PM

‘నాయ్‌ శేఖర్‌’, ‘కంజూరింగ్‌ కన్నప్పన్‌’ వంటి చిత్రాల తర్వాత హాస్య నటుడు సతీష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్దైకారన్‌’. వైట్‌ కార్పెట్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మాత కె.విజయ్‌ పాండి నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ వెంకీ రూపొందించారు. బ్లాక్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విశేషాలను చిత్ర బృందం చెన్నైలో విలేకరుల సమావేశంలో పేర్కొంది.

Sathish: వారితో కామెడీ చేయించి.. నేను నటించా!
Vithaikaran Movie Press Meet

‘నాయ్‌ శేఖర్‌’, ‘కంజూరింగ్‌ కన్నప్పన్‌’ వంటి చిత్రాల తర్వాత హాస్య నటుడు సతీష్‌ (Sathish) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్దైకారన్‌’ (Vithaikaran). వైట్‌ కార్పెట్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మాత కె.విజయ్‌ పాండి నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ వెంకీ రూపొందించారు. బ్లాక్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర విశేషాలను చిత్ర బృందం చెన్నైలో విలేకరుల సమావేశంలో పేర్కొంది. (Vithaikaran Release Press Meet)

ఈ కార్యక్రమంలో హీరో సతీష్‌ మాట్లాడుతూ... రూ.25 కోట్ల డైమండ్‌ను నేను, ఆనంద్‌రాజ్‌, మధుసూదనన్‌, సుబ్రమణ్య శివతో కూడిన బృందం స్వాధీనం చేసుకోవాలని భావిస్తాం. ఇందులో ఎవరు విజయం సాధించారన్న స్టోరీని బ్లాక్‌ కామెడీ జోనర్‌లో దర్శకుడు రూపొందించారు. నేను ద్విపాత్రాభినయం చేశా. ఒక క్యారెక్టర్‌ మెజీషియన్‌ రోల్‌. ఈ పాత్ర కోసం ఒకరి వద్ద మ్యాజిక్‌ నేర్చుకున్నా. మరో క్యారెక్టర్‌ సస్పెన్స్‌. 40 శాతానికిపైగా సన్నివేశాలను ఎయిర్‌పోర్టులో చిత్రీకరించాం. ఈ సినిమాలో నేను కామెడీ చేయలేదు. నాతో పాటు ఉండే వారితో కామెడీ చేయించి నేను నటించా. ‘చట్టం ఎన్‌ కైయిల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నా. హీరోయిన్‌గా సిమ్రన్‌ గుప్తా నటించారు. ఆనంద్‌రాజ్‌, మధుసూదనన్‌, సుబ్రమణ్య శివ, జాన్‌ విజయ్‌, ఆసిఫ్‌ అలీ, పావెల్‌ జపాన్‌ కుమార్‌, శామ్స్‌, స్వామినాథన్‌, మారిముత్తు తదితరులు ఇతర పాత్రలను పోషించారని తెలిపారు.


Sathish-Movie.jpg

దర్శకుడు వెంకీ మాట్లాడుతూ... ‘స్ర్కిప్టును సిద్ధం చేసుకుని అనేక మంది నిర్మాతలను కలిశాను. కానీ ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. అయితే, నిర్మాత విజయ్‌ను కలిసి కథ వివరించగానే ఒకే చెప్పారు. ఒక నిర్మాతగా నేను అడిగినవన్ని ఆయన సమకూర్చారు. సినిమా చూశాక ఈ విషయం మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో పలువురు కొత్త ముఖాలు పనిచేశారు. వారందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

Updated Date - Feb 14 , 2024 | 10:16 PM