Aishwarya weds Umapathy: వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:06 PM

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం (జూన్ 10)న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఇటీవల ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లిని కూడా ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించారు.

Aishwarya weds Umapathy: వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్
Aishwarya weds Umapathy

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun) వివాహం సోమవారం (జూన్ 10)న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు, నటుడు ఉమాపతి (Umapathy)తో ఇటీవల ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లిని కూడా ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించారు. (Aishwarya weds Umapathy)

Also Read- Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!


Aishwarya-and-Umapathi.jpg

*ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల పెళ్లి ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల పెళ్లికి (Aishwarya Arjun and Umapathy Marriage) సంబంధించి.. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక మొదలైంది. జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10న ఉదయం సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం జరిగింది. కాగా, ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Latest Cinema News

Umapathi.jpg

Updated Date - Jun 11 , 2024 | 03:46 PM