Amaran: 'అమరన్' థియేటర్‌పై బాంబ్ దాడి.. ఏమైందంటే
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:55 AM
'అమరన్' షో నడుస్తున్న థియేటర్‌పై బాంబ్ దాడి జరిగింది. ఎవరు ఊహించని ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
'అమరన్'.. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఒకవైపు సూర్య 'కంగువ' మూవీ తమిళనాడులోనూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 'అమరన్' థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలోనే తమినాడులో 'అమరన్' షో నడుస్తున్న థియేటర్‌పై బాంబ్ దాడి జరిగింది. దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారంటే..
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని ఒక థియేటర్లో అందరు సంతోషంగా 'అమరన్' సినిమా చూస్తుండగా ఎవరు ఊహించని సంఘటన ఎదురైంది. ఈ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబ్ లతో దాడి చేస్తూ రెచ్చిపోయారు. దీంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. మరోవైపు ఈ దాడికి కారణం స్థానిక గొడవలే కారణమని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2014లో కశ్మీర్లో ఉగ్రవాదులను ఎదురించి వీరమరణం పొందిన తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీగా తెరకెక్కిన ఈ సినిమాలో ముకుంద్‌గా శివ కార్తికేయన్, ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి నటించింది. ఐదేండ్ల ప్రాయంలోనే మిలటరీ మార్చ్‌ను చూసి ఎప్పటికైనా ఆర్మీలో చేరాలని ముకుంద్ లక్ష్యంగా పెట్టుకుని, తన గ్రాడ్యుయేషన్ టైం నుంచి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తను డిగ్రీ చదువుతున్న కాలేజీలోకి కొత్తగా మలయాళీ అయిన ఇందు రెబెకా వర్గీస్ చేరడం, వారి పరిచయం ప్రేమగా మారడం జరిగిపోతాయి. ఆ పై ఆర్మీలో చేరిన ముకుంద్ ఇందును పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఇష్యూ, ఆర్మీలో కెప్టెన్‌గా, కమాండర్‌గా, మేజర్‌గా ఎదగడం.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై రావడం జరుగుతుంది. ఈక్రమంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను అంతమొందించి ఎలా అమరుడయ్యాడనే నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది.