Katrina Kaif: చెన్నై నా సెకండ్ హోం టౌన్
ABN , Publish Date - Jan 09 , 2024 | 01:51 PM
తనకు ముంబై నగరం మొదటి ఇల్లు అయితే చెన్నై నగరం రెండో హోం టౌన్ అని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతితో కలిసి కత్రినా కైఫ్ నటించిన తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా హాజరయ్యారు.
తనకు ముంబై నగరం మొదటి ఇల్లు అయితే చెన్నై నగరం రెండో హోం టౌన్ అని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) అన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో కలిసి కత్రినా కైఫ్ నటించిన తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’ (Merry Christmas). శ్రీరామ్ రాఘవన్ (Sriram Raghavan) దర్శకుడు. టీను ఆనంద్, సంజయ్‌కపూర్, వినయ్ పాథక్, ప్రతిమా ఖన్నన్, రాధికా ఆప్టే, అశ్విన్ ఖల్సేకర్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. రమేష్ తారణి, సంజయ్ రౌత్రే, జయ తారణి, కెవల్ గార్గ్ నిర్మాతలు. ఈనెల 12వ తేదీన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో కత్రినా కైఫ్ మాట్లాడుతూ... ‘హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించా. ఇది నాకు తొలి తమిళ చిత్రం. తమిళ నేటివిటీకి అనుగుణంగా ఉంటుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయాలి’ అని అన్నారు. హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ... ‘నాకు, దర్శకుడు శ్రీరామ్‌కు మధ్య జరిగిన ఒక వీడియో కాల్ సంభాషణ ఈ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘బద్లాపూర్’ చిత్రంలో శ్రీరామ్ పనితనం చూసి మంత్రముగ్ధుడిని అయిపోయా. అపుడే శ్రీరామ్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నా. నా కంటే సీనియర్ నటి అయిన కత్రినా కైఫ్‌తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. (Merry Christmas Media Meet)
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ మాట్లాడుతూ... ‘నేను తమిళుడినే. కానీ, బాంబే, పూణెలలో ఉండిపోయా. తమిళంలో ఒక చిత్రం చేయాలనే చిరకాల కోరిక. ‘మెర్రీ క్రిస్మ్‌స’తో ఆ కోరిక తీరింది. భవిష్యత్తులో కూడా మరిన్ని చిత్రాలు తీయాలన్నదే నా కోరిక’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి కెమెరా మధు నీలకంఠన్, ఎడిటింగ్ పూజ, సంగీతం ప్రీతమ్.
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..
*************************
*కెప్టెన్ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?
*************************