DD Returns Part 2: హీరో లేకుండానే షూటింగ్‌.. ఒకటే వార్తలు

ABN , Publish Date - Aug 20 , 2024 | 10:30 PM

ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు సంతానం నటించిన ‘డిడి రిటర్న్స్‌’ సినిమా రెండోభాగం షూటింగ్‌ హీరో లేకుండానే శరవేగంగా సాగుతోంది. గత యేడాది వచ్చిన తొలిభాగాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో వాణిజ్యపరంగా సక్సెస్‌ సాధించింది. ఇపుడు రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో ఆర్య తన సొంత బ్యానరుపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

DD Returns Part 2 Shoot Started

ప్రేమ్‌ ఆనంద్‌ (Prem Anand) దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు సంతానం (Santhanam) నటించిన ‘డిడి రిటర్న్స్‌’ సినిమా రెండోభాగం (DD Returns Part 2) షూటింగ్‌ హీరో లేకుండానే శరవేగంగా సాగుతోంది. గత యేడాది వచ్చిన తొలిభాగాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో వాణిజ్యపరంగా సక్సెస్‌ సాధించింది. ఇపుడు రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో ఆర్య తన సొంత బ్యానరుపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి ప్రకటన లేకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్‌ రెండు వారాలుగా చెన్నై నగరంలోని గోకులం స్టూడియోలో జరుగుతోంది.

Also Read- Hema: సీఎం రేవంత్, పవన్  కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కావాలి!

ఈ సినిమా కోసం ఈ స్టూడియోలో ఓ భారీ సెట్‌ వేసి అందులో చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌లో సినిమాకు సంబంధించి అధికభాగం షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూట్‌పై కోలీవుడ్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా హీరో లేని సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారనేలా వార్తలు వస్తున్నప్పటికీ.. అసలు ఇందులో సంతానం ఉన్నాడా? అనేలా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.


santhanam.jpg

అదేమంటే.. హీరో సంతానం లేకుండా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుందని, హీరో లేకుండా షూటింగ్ ఏంటి? అంటూ ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం సంతానం ఏం బిజీగా కూడా లేడు. అలాంటిది ఆయనపై సన్నివేశాలు తీయకుండా.. వేరే ఏవో తీస్తున్నారంటే.. సంతానం ఈ సినిమాలో డౌటే అనేలా టాక్‌ని స్ర్పెడ్ చేస్తున్నారు. కాగా, కొన్నేళ్ళ కిత్రం రాంబాలా దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘దిల్లుక్కు దుడ్డు’. ఈ సినిమా ఒకటి, రెండు భాగాలు వచ్చాయి. ఈ చిత్రం మూడో భాగాన్ని ‘డిడి రిటర్న్స్‌’ (DD Returns) పేరుతో రాం బాలా శిష్యుడు ప్రేమ్‌ ఆనంద్‌ రూపొందించిన విషయం తెలిసిందే.

Read Latest Cinema News

Updated Date - Aug 20 , 2024 | 10:30 PM