Disha Patani: ‘కంగువ’ కోసం దిశా పటాని.. దిమ్మ దిరిగే రెమ్యునరేషన్

ABN , Publish Date - Nov 16 , 2024 | 06:55 PM

ఇటీవల రిలీజైన ‘కంగువ’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించిన బాలీవడ్ హాట్ క్వీన్ 'దిశా పటాని' ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలిస్తే మీ మైండ్ దిమ్మ దిరిగి పోవాల్సిందే. ఇంతకీ ఆమె ఏంత ఛార్జ్ చేసింది అంటే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించిన బాలీవడ్ హాట్ క్వీన్ 'దిశా పటాని' ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలిస్తే మీ మైండ్ దిమ్మ దిరిగి పోవాల్సిందే. ఇంతకీ ఆమె ఏంత ఛార్జ్ చేసింది అంటే..


'కంగువ' సినిమాలో దిశా పటాని అంతగా ఆకట్టుకోలేపోయింది. కేవలం ఆ సినిమానే కాదు ఆమె గతంలో నటించిన ఏ క్యారెక్టర్‌లోను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. కేవలం శరీరా సౌందర్యాన్ని చూసి మాత్రమే దర్శకులు ఛాన్సులు ఇస్తున్నారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె ఏ సినిమా కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఛార్జ్ చేసింది. దీంతో అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు.


ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొన్ని వందల ఏళ్ళ క్రితం సముద్రాన్ని ఆనుకొని ప్రణవ కోన, రుధిర కోన, కపాల కోన, హిమ కోన, చీకటి కోన అని ఐదు ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో కోనకు ఒక్కో పాలకుడు ఉంటాడు. ప్రణవ కోనకి కంగువా (సూర్య) పాలకుడు. చాలా గొప్ప వీరుడు. కపాల కోనకు ఉధిరన్‌ (బాబీడియోల్‌) పాలకుడు. సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్‌ చక్రవర్తి ప్రణవ కోనను తన వశం చేసుకోవాలనుకుంటాడు. ఐదు కోనల మధ్య అంతర్‌ యుద్దం వచ్చేలా ప్రణాళిక రచిస్తాడు. ఇందులో ప్రణవ కోన, హిమ కోన ఒక పక్షం. మిగిలిన మూడు కోనలు మరో పక్షం. అయితే యుద్థం సమీపంలో ఉండగా పలోమా అనే ఓ చిన్నపిల్లాడి కోసం.. ప్రణవ కోనని వదిలి చీకటి కోన అనే చోటుకి వెళ్లిపోతాడు కంగువా. ఇంతకీ ఈ పలోమా ఎవరు? అతని కోసం కంగువా ఎందుకు రాజ్యాన్ని విడిచాడు? మొత్తం ప్రణవ కోన జాతిని అంతం చేయడానికి వచ్చిన కపాల కోన నాయకుడు బాబీ డియోల్‌ లక్ష్యం నెరవేరిందా? తమ జాతిని రక్షించడానికి కంగువా రణ రంగంలో దిగాడా లేదా? ఇది ఒక కథ.


అయితే.. ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్‌. పోలీసులు కూడా చేయలేని పనులు చేసే క్రమంలో జీటా అనే బాలుడిని కలుసుకుంటాడు. ఫ్రాన్సిస్‌, జీటా కలుసుకోగానే ఇద్దరికీ ఏదో తెలియని సంబంధం ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. జీటా సమస్యలో ఉన్నాడని తెలుసుకున్న అతను జీటాని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అసలు జీటాని వెంటాడుతున్నది ఎవరు? ఫ్రాన్సిస్‌, జీటా, 1070 సంవత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య)కి మధ్య సంబంధం ఏమిటి? అన్నది తెరపైనే చూడాలి.

Also Read-S Thaman: ‘పుష్ప 2’.. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం

Also Read-Kanguva Review: సూర్య నటించిన యాక్షన్ డ్రామా ‘కంగువా’ ఎలా ఉందంటే...

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2024 | 06:55 PM