Raghu Thatha: కీర్తి సురేష్ ‘రఘు తాతా’ కాంట్రవర్సీపై క్లారిటీ వచ్చినట్లేనా?
ABN , Publish Date - Jul 22 , 2024 | 08:52 PM
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రఘు తాతా’. సుమన్ కుమార్ దర్శకుడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫార్సీ’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లకు కథా రచయితగా ఆయన పని చేశారు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మాణంలో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రఘు తాతా’ (Raghu Thatha). సుమన్ కుమార్ (Suman Kumar) దర్శకుడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫార్సీ’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లకు కథా రచయితగా ఆయన పని చేశారు. ‘రఘు తాతా’లో కీర్తి సురేష్, ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, ఆనంద్ స్వామి, దేవదర్శిని, రాజీవ్ రవీంద్రనాథన్ తదితరులు నటించారు. హోంబలే సంస్థ నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. లేడీ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ ఒక యూనిక్ పాయింట్‌తో నిర్మాణ సంస్థ తెరకెక్కించింది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదల అనంతరం కొంత మేరకు కాంట్రవర్సీ నడుస్తోంది. తాజాగా జరిగిన ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మేకర్స్ కాంట్రవర్సీకి తెరదించే ప్రయత్నాలు చేశారు. (Raghu Thatha Controversy)
Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు
ఈ కార్యక్రమంలో దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘రఘు తాతా’కు దర్శకత్వం వహిస్తానని అనుకోలేదు. హిందీ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఒక వ్యక్తి తన పదోన్నతి కోసం హిందీ పరీక్ష రాసిన విషయం నా దృష్టికి వచ్చింది. అదే ఈ చిత్రానికి మూలకథ. అయితే, ఈ కథతో పాటు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కావడానికి మూల కారణం సహ రచయితలైన ఆనంద్, మనోజ్. ఈ సినిమాలో హిందీ భాషను బలవంతంగా ప్రయోగించడాన్ని చూపించలేదు. కానీ, మహిళలపై బలవంతంగా రుద్దడాన్ని కామెడీ టచ్‌తో రూపొందించామని తెలిపారు. (Raghu Thatha Audio and Trailer Launch Event)
హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ... ఒక మంచి సినిమాలో నటించాను. ఈ స్క్రిప్ట్‌ను ప్రేక్షకుల చెంతకు ఎలా చేర్చుతారన్న భయం ఉండేది. దాన్ని దర్శకుడు చక్కగా మలిచారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫార్సీ’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లకు కథా రచయితగా పనిచేసిన సుమన్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే, బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే బ్యానరుతో కలిసి పనిచేయడం రెట్టింపు ఆనందాన్నిస్తుందన్న కీర్తి నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది అందరూ చూడాల్సిన చిత్రమని అన్నారు.
Read Latest Cinema News