Hero: బాల్యం నుంచి ఖాకీ యూనిఫాంపై ప్రేమ.. కానీ

ABN , Publish Date - Nov 06 , 2024 | 05:57 PM

బాల్యం నుంచే తనకు ఖాకీ యూనిఫాంపై ప్రత్యేకమైన ప్రేమ ఉందని ఓ హీరో అన్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Police Dress

బాల్యం నుంచే తనకు ఖాకీ యూనిఫాంపై ప్రత్యేకమైన ప్రేమ ఉందని అన్నారు హీరో నకుల్‌ (Hero Nakkhul). ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘ది డార్క్‌ హెవెన్‌’ (The Dark Heaven). బాలాజీ దర్శకుడు. ఈయన గతంలో ‘డీ3’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గోదై ఎంటర్‌టైన్మెంట్‌, ఎంఎస్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో దర్శక హీరోలతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Also Read-Celebrity Couple: కోర్టు మెట్లెక్కిన మరో సెలబ్రిటీ కపుల్.. ఎవరంటే

ఈ కార్యక్రమంలో దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సీనియర్‌ నటుడు శశికుమార్‌ రిలీజ్‌ చేశారు. నేను డైరెక్ట్‌ చేసిన తొలి చిత్రం ఫస్ట్‌లుక్‌ కూడా ఆయనే రిలీజ్‌ చేశారు. ఈ సినిమా బాగా వచ్చింది. హీరో నకుల్‌కు మంచి పేరు వస్తుంది. ఇందులో నటుడు అలెక్స్‌ మరో ముఖ్యపాత్ర పోషించారు. మూడు టైమ్ పీరియడ్స్‌లో మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఇందుకోసం నకుల్‌ తన శరీరాన్ని ఎంతో శ్రమించి మార్చుకున్నారు. ఇప్పటివరకు అనేక పాత్రల్లో నకుల్‌ను చూశాం. కానీ, ఇప్పటివరకు చూడని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారని పేర్కొన్నారు.


The-Dark-Heavan.jpg

హీరో నకుల్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన నటులు కమల్‌ హాసన్‌, విక్రమ్‌, సూర్య. ఇపుడు అలాంటి పాత్ర చేయాల్సి రావడంతో నేను భయానికి లోనయ్యా. బాల్యం నుంచి ఖాకీ యూనిఫాంపై ప్రేమ ఉన్నప్పటికీ ఆ దుస్తులు ధరించగానే తెలియని భయంతో పాటు గర్వం కూడా వచ్చేసింది. పోలీస్‌ పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. పోలీస్‌ శాఖ చేసే అనేక మంచి పనులు ఈ చిత్రంలో చూపించాం. కచ్చితంగా ఈ సినిమా పోలీస్ శాఖపై గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు.

Also Read-Suriya - NBK: సింగం, సమరసింహం ఒకే స్టేజ్‌పై.. ‘ఐ లవ్ యు’

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2024 | 05:57 PM