Mari Selvaraj: ముస్లింలే రక్షించారని బాధితులే చెప్పడంతో హ్యాపీ..

ABN , Publish Date - Sep 18 , 2024 | 09:55 PM

ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను జాతి, కులమతాలకతీతంగా ముస్లిం సోదరులు రక్షించారనే విషయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్‌ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘వాళై’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Director Mari Selvaraj

ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను జాతి, కులమతాలకతీతంగా ముస్లిం సోదరులు రక్షించారనే విషయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘వాళై’ (Vaazhai) చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర 25 డేస్‌ సక్సెస్‌ వేడుకలను చెన్నై నగరంలో నిర్వహించారు. ఇందులో ఈ చిత్రంలో నటించిన ప్రతి నటుడికి, సినిమా నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్‌కు విజయోత్సవ షీల్డ్‌ బహుకరించారు.

Also Read- Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు.. మ్యాటర్ సీరియస్

ఈ కార్యక్రమంలో దర్శకుడు మారి సెల్వరాజ్‌ మాట్లాడుతూ.. ‘వాళై’ సినిమాను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. నిఖిలా విమల్‌ను నేను దర్శకత్వం వహించిన ‘కర్ణన్‌’, ‘మామమన్నన్‌’ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నించాను. అది సాధ్యపడలేదు. ‘వాళై’ సినిమాతో అది తీరిపోయింది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం ఎంతోబలం. సినిమాలో వచ్చే సన్నివేశాల్లో అనేక మంది తమను చూపించలేదని కోపగించుకుంటున్నారు. ఈ సినిమా నాకు సంబంధించింది. ప్రమాదం జరిగినపుడు ఘటనా స్థలంలో నేను లేను. కానీ, ప్రమాద బాధితులను కులమతాలకు అతీతంగా ముస్లింలే రక్షించారని బాధితులే చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి కృతఙ్ఞతులు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.


నిఖిలా విమల్ (Nikhila Vimal), పొన్‌వేల్‌, రాహుల్‌, కలైయరసన్‌, సతీష్‌కుమార్‌, దివ్య దురైస్వామి, జానకి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా తేని ఈశ్వర్‌, ఎడిటింగ్‌ సూర్య ప్రధానమన్‌, సంగీతం సంతోష్‌ నారాయణన్‌. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, నవి స్టూడియోస్‌, ఫార్మర్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మించాయి.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 09:55 PM