Vijay: విజయ్ మహానాడుపై అగ్రహీరోల మౌనం.. కారణమేంటో
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:27 PM
తమిళ చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరైన విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి మహానాడు ఆదివారం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు హాజరైన లక్షలాది మంది తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ కీలక ప్రసంగం చేశారు. అయితే ఈ మహానాడుపై కోలీవుడ్ అగ్ర హీరోలెవరూ మాట్లాడకపోవడంపై తమిళనాట రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
తమిళ చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరైన విజయ్ (Vijay) స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) (Tamilaga Vettri Kazhagam) తొలి మహానాడు ఆదివారం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు హాజరైన లక్షలాది మంది తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ కీలక ప్రసంగం చేశారు. విజయ్ చేసిన తొలి రాజకీయ స్పీచ్ అదుర్స్ అంటూ కామెంట్స్ పడుతున్నాయి. అయితే, విజయ్ రాజకీయ భవిష్యత్, టీవీకే తొలి మహానాడు విజయవంతం కావాలంటూ కోలీవుడ్‌కు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు చేశారు. వీరిలో సూర్య, కార్తీ, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, జయం రవి, శివకార్తికేయన్, శశికుమార్, ప్రభు, సిబి సత్యరాజ్, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్, వసంత్ రవి, వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, సూరితో పాటు పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ అగ్ర హీరోలెవరూ ఈ మహానాడుపై మాట్లాడలేదు.
Also Read-Allu Arjun: ‘అయాన్.. నా గొడ్డలి ఎప్పుడు తీసుకెళ్లావ్’ బన్నీ వైరల్ పోస్ట్
కోలీవుడ్ అగ్రహీరోలైన సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ హీరోలు అజిత్ కుమార్, ధనుష్ వంటి వారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే, రాజకీయాల్లో విరోధి అయిన, హీరో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కూడా విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, హీరో విజయ్‌కు మంచి స్నేహితుడైన అజిత్ విషెస్ చెప్పకపోవడం ఇపుడు కోలీవుడ్‌లో చర్చసాగుతుంది. మరోవైపు టాలీవుడ్ నుండి అందునా ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కోలీవుడ్ అగ్ర హీరోల మౌనం వెనుక కారణం ఏమై ఉంటుందా అని తమిళనాట చర్చలు నడుస్తున్నాయి. కొందరేమో ఇప్పుడేగా అరంగేట్రం.. కాస్త టైమ్ పడుతుందిలే అంటూ కవర్ చేస్తున్నవారూ లేకపోలేదు.