Maatram: రైతులకు పది ట్రాక్టర్లను బహూకరించిన రాఘవ లారెన్స్

ABN , Publish Date - May 03 , 2024 | 10:13 PM

కొరియోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాట్రం’ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో జరిగింది.

Maatram: రైతులకు పది ట్రాక్టర్లను బహూకరించిన రాఘవ లారెన్స్
Raghava Lawrence

కొరియోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాట్రం’ (Maatram) ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పది మంది రైతులకు (Farmers) ఉచితంగా ట్రాక్టర్లు (Tractors) అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో జరిగింది. ఇందులో మరో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య (SJ Suryah), లారెన్స్‌ తల్లి, లారెన్స్‌ అభిమానులు, లబ్దిదారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

*Geetha Arts: పెద్దమ్మ దేవాలయ నిర్వాహణపై అల్లు ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్ హెడ్ లేఖ 


ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ.. కార్మికుల దినోత్సవం సందర్భంగా తమ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ‘సేవే దైవం’ (Seve Daivam) పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో భాగంగా దేశానికి వెన్నెముక అయిన రైతులకు తొలి దశగా పది ట్రాక్టర్లను బహుకరించామన్నారు. అవసరమైన వారికి తగిన విధంగా సాయం చేసేందుకు తమతో చేతులు కలుపుతారని, మాటల కంటే పనితీరు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో అందరి మద్దతు ఇవ్వాలని, మున్ముందు భారీ స్థాయిలో సాయం చేయడానికి అందరి ఆశీస్సులు కావాలని కోరారు. కాగా, ఈ చారిటబుల్‌ ట్రస్ట్‌కు నటుడు ఎస్‌జే సూర్య తన వంతు సాయంగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Updated Date - May 03 , 2024 | 10:13 PM