Silambarasan TR: హాస్య నటుడికి హీరో శింబు ఆర్థిక సాయం
ABN , Publish Date - Jun 27 , 2024 | 10:11 PM
తమిళ చిత్రపరిశ్రమలో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన వెంగల్ రావు అనారోగ్యంతో మంచానికే పరిమితమై వైద్య ఖర్చుల కోసం ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఈ విషయంపై ఆయన ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోను చూసిన హీరో శింబు స్పందించారు. వెంగల్ రావుకు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)లో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన వెంగల్ రావు (Vengal Rao) అనారోగ్యంతో మంచానికే పరిమితమై వైద్య ఖర్చుల కోసం ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఈ విషయంపై ఆయన ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోను చూసిన హీరో శింబు (Silambarasan TR) స్పందించారు. వెంగల్ రావుకు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు పాతిక సంవత్సరాల పాటు కొనసాగిన వెంగళరావు ప్రముఖ హాస్య నటుడు వడివేలు (Vadivelu)తో కలిసి అనేక కామెడీ సన్నివేశాల్లో నటించి, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
Also Read- Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...
కొన్ని కారణాలతో వడివేలు సినిమాలకు దూరం కావడంతో వెంగల్ రావుకు కూడా సినీ అవకాశాలు తగ్గిపోయాయి. అదేసమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆయనకు పక్షవాతం రావడంతో ఒక కాలు, చెయ్యి పనిచేయడం మానేశాయి. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తన దీనస్థితిని వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. దీన్ని చూసిన హీరో శింబు (Hero Simbu) రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. శింబు స్పందన, సహాయంపై కోలీవుడ్‌లోనే కాకుండా.. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Latest Cinema News