Kanguva: 'కంగువ' రిలీజ్‌పై సస్పెన్స్

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:04 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొట్టుకెక్కింది. ఈ కేసును మద్రాస్ హైకోర్టు స్వీకరించడంతో సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ ఏర్పడింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌కు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యూజ్ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొట్టుకెక్కింది. ఈ కేసును మద్రాస్ హైకోర్టు స్వీకరించడంతో సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ ఏర్పడింది.


ఒకవైపు సినిమా రిలీజ్ దగ్గుపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. మరోవైపు హీరో సూర్య సినిమా ప్రమోషన్స్ ని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తమ దగ్గర 99 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, మరో 45 కోట్లు చెల్లించాలని మద్రాస్ కోర్టుని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఆశ్రయించింది. మిగతా డబ్బు మొత్తం చెల్లించేంత వరకు సినిమా రిలీజ్‌ని ఆపాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇక పిటిషన్‌ని విచారించిన కోర్టు.. కేసును నవంబర్ 7కి వాయిదా వేసింది. దీంతో ఈ చిత్ర రిలీజ్‌పై సస్పెన్స్ ఏర్పడింది.


ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు పాన్ ఇండియా మూవీగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా రెండవ భాగాన్ని కూడా ప్లాన్ చేసినట్లు ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్‌ తెలిపారు. సెకండ్ పార్ట్ 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశామని నిర్మాత ప్రకటించారు.

Updated Date - Nov 03 , 2024 | 09:04 PM