Movie Theaters: రాష్ట్రంలో సినిమా థియేటర్లకు గడ్డుకాలం

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:54 PM

రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు ఈ యేడాది గడ్డుకాలం కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు ముగిసిపోగా, మూడో నెల ప్రారంభమైంది. ఈ కొత్త యేడాదిలో పలువురు అగ్ర హీరోల చిత్రాలు విడుదలవుతాయని, ఆ సమయంలో థియేటర్ల సందడి వాతావరణం నెలకొంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మార్చి, ఏప్రిల్‌ మంత్స్‌లో ఎగ్జామ్స్, ఐపీఎల్ ఉండటంతో.. కొన్ని చోట్ల థియేటర్లను మూసి వేసే పరిస్థితి నెలకొంది.

Movie Theaters: రాష్ట్రంలో సినిమా థియేటర్లకు గడ్డుకాలం

రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు ఈ యేడాది గడ్డుకాలం కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు ముగిసిపోగా, మూడో నెల ప్రారంభమైంది. ఈ కొత్త యేడాదిలో పలువురు అగ్ర హీరోల (Star Heroes) చిత్రాలు విడుదలవుతాయని, ఆ సమయంలో థియేటర్ల సందడి వాతావరణం నెలకొంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తొలి రెండు నెలల్లో రజనీకాంత్‌, కమలహాసన్‌, విజయ్‌, అజిత్‌, విక్రమ్‌, సూర్య, కార్తీ వంటి హీరోలు నటించిన చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. సంక్రాంతికి ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Dhanush Captain Miller), శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ (Siva Karthikeyan Ayalaan) చిత్రాలు విడుదలకాగా, గత నెలలో జయం రవి నటించిన ‘సైరన్‌’ (Jayam Ravi Siren) విడుదలైంది. వీటిలో ‘అయలాన్‌’, ‘సైరన్‌’ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఈ రెండు నెలల కాలంలో అనేక చిత్రాలు విడుదలైనప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేక బోసిబోయి కనిపిస్తున్నాయి.


NO-Audience.jpg

ప్రతి శుక్రవారం విడుదలవుతున్న చిత్రాలు థియేటర్లలో ఒకటి రెండు రోజులకు మించి ప్రదర్శనకు నోచుకోవడం లేదు. దీనికితోడు మార్చిలో విద్యార్థులకు పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా ఈనెల 22వ తేదీ నుంచి ఐపీఎల్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ఈవెనింగ్‌ షోలు ప్రదర్శించడం అనుమానంగా మారింది. అసలే ప్రేక్షకులు లేక పగటి షోలనే రద్దు చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రారంభమైతే ఈవెనింగ్‌, నైట్‌ షోలకు కూడా ప్రేక్షకుల రావడం అనుమానమేనని థియేటర్‌ యజమానులు వాపోతున్నారు. ఇదేపరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

Updated Date - Mar 08 , 2024 | 03:54 PM