Udhayanidhi Stalin: అప్పుడు భాష, ఇప్పుడు ఇండస్ట్రీ.. బాలీవుడ్‌పై ఉదయనిధి ఫైర్

ABN , Publish Date - Nov 03 , 2024 | 05:12 PM

తమిళనాడు డిప్యూటీ సీఎం, యాక్టర్, ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్ తాజాగా బాలీవుడ్ అధిపత్యంపై ఫైర్ అయ్యారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలకు, ఉత్తరాది సినీ ఇండస్ట్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..

తమిళనాడు డిప్యూటీ సీఎం, యాక్టర్, ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్ బాలీవుడ్‌పై నిప్పులు చెరిగారు. మొదటి నుండి హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడాని వ్యతిరేఖించినా ఉదయనిధి తాజాగా బాలీవుడ్ అధిపత్యంపై ఫైర్ అయ్యారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలకు, ఉత్తరాది సినీ ఇండస్ట్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..


తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. "దక్షిణాదిలో త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌తో పాటు మ‌ల‌యాళం చిత్ర ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ.. ఉత్తరాదిలో కేవలం హిందీ సినిమాలు( బాలీవుడ్) ఆధిపత్యం నడుస్తుంది. ఇతర భాషలైన మ‌రాఠీ, బిహారి, భోజపురి, హర్యానా, గుజరాత్ భాషల సినిమాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ తొక్కేస్తుంది. మరికొన్ని రాష్ట్రాలకు సొంత సినిమా పరిశ్రమలు లేవు. ఇక సౌత్ లో తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలు కోట్లాది రూపాయలు బిజినెస్ ని చేస్తున్నాయి. మరి నార్త్ లో ఏదైనా ఒక రాష్ట్రం నుండి బలమైన సినీ ఇండస్ట్రీ ఉద్బవించకుండా హిందీ పరిశ్రమ చేసింది. దీంతో ఇతర భాషలన్నీ హిందీతో పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాయి. ఫలితంగా అక్కడ కేవలం హిందీ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ఇతర భాష చిత్రాలను తొక్కేయడంతో ఆదరించే నాధుడే లేకుండా పోయారు. ఇతర రాష్ట్రాల వారు తమ భాష, భాష చిత్రాలను కాపాడుకోకపోతే హిందీ సినీ ఇండస్టీ ఇతర సంస్కృతులను నాశనం చేస్తుందని" ఫైర్ అయ్యారు.


ఇక 1930, 1960 తమిళనాడులో ద్రావిడ ఉద్యమం ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, భాషలపై ఉత్తరాది, హిందీ అధిపత్యంపై ఈ ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఉదయనిధి స్టాలిన్ పార్టీ అయినా డీఎంకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్‌ల నుండి ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ ఉద్యమాలను కంటిన్యూ చేస్తున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 05:12 PM