The GOAT: మూవీ టిక్కెట్ల‌ను ఎక్కువ రేట్ల‌కు అమ్మొద్దు.. పార్టీ నేత‌లకు స్ట్రాంగ్ వార్నింగ్‌

ABN , Publish Date - Sep 02 , 2024 | 07:19 PM

ఈ నెల 5వ తేదీన విజయ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం ఒక షరతు విధించింది.

vijay

ఈ నెల 5వ తేదీన విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) (The GOAT) విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం ఒక షరతు విధించింది. ఈ సినిమా టిక్కెట్లను పార్టీకి చెందిన నేతలు లేదా కార్యకర్తలు అధిక ధరకు విక్రయించరాదని స్పష్టం చేసింది. సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ తరహా కండిషన్‌ పెట్టింది.

goat.jpg

టీవీకే శ్రేణులు అధిక ధరకు టిక్కెట్లు అమ్మినట్టు తెలిసినా, పట్టుబడినా తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకుడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే నాలుగు పాటల లిరికల్‌ వీడియోలను రిలీజ్‌ చేయగా, ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), మాళవిక శర్మ, ప్రశాంత్‌, రాఘవ లారెన్స్‌, ప్రభుదేవా, ప్రేమ్‌జీ అమరన్‌, మోహన్‌, అజ్మల్‌ అమీర్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

Updated Date - Sep 02 , 2024 | 07:19 PM