Venkat Prabhu: ట్యూన్ రెడీ అయిన రోజే మరణించింది
ABN , Publish Date - Sep 03 , 2024 | 07:32 PM
దర్శకుడు వెంకట్ ప్రభు (venkat Prabhu) తన తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The gretest of All time) విశేషాలు పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
దర్శకుడు వెంకట్ ప్రభు (venkat Prabhu) తన తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The gretest of All time) విశేషాలు పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇళయరాజా (Ilaiyaraaja) కుమార్తె భవతారణితో (Bhavatarani)ఓ పాట పాడించాలని నిర్ణయించుకున్నానని, సంబంధిత ట్యూన్ కంపోజ్ పూర్తయిన రోజే ఆమె మృతి ఆమె చెందారన్న వార్త తెలిసి జీర్ణించుకోలేకపోయానన్నారు. అదే పాటలో ఆమె గాత్రాన్ని ఎలా వినిపించారో వివరించారు. ‘‘ఓ రోజు ‘చిన్న చిన్న కంగళ్’ సాంగ్ థీమ్ గురించి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నాకు చెప్పాడు. ఆ పాటను ఆయన సోదరి, గాయని భవతారిణి పాడించాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో ఉన్నారు. త్వరగా కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ‘లాల్ సలామ్’ సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు రాహుల్ హమీద్ గాత్రాన్ని వినిపించినప్పుడు.. మనమెందుకు అలా చేయకూడదని యువన్‌ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీమ్‌ను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని, మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్‌పుట్ తీసుకురాగలిగాం. ట్యూన్ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ ఈ పాటను పాడతానన్నారు. అలా విజయ్, భవతారణిల గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది’’ అని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతారణి. క్యాన్సర్ చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో శ్రీలంక వెళ్లిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఆమె ఆలపించిన ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ (గుండెల్లో గోదారి) విశేషంగా అలరించింది. ‘భారతి’ చిత్రంలోని ‘మయిల్ పోలా పొన్ను ఒన్ను’ పాటకుగాను బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డును ఆమె అందుకున్నారు.