Vidudala 2: వెట్రిమారన్ ‘విడుదల 2’.. 4 గంటలకు పైగా నిడివితో..
ABN , Publish Date - Sep 08 , 2024 | 05:12 PM
నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’ థియేట్రికల్‌గా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘విడుదల 2’ ను ఈ డిసెంబరు నెలలో రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’ (Vidudala Part 1) థియేట్రికల్‌గా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటించగా రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ సాధించిన విజయంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ తరం దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. ‘దీంతో విడుదల 2’ ఎప్పుడు విడుదలవుతుందా? అని చాలామంది సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘విడుదల 2’ (Vidudala Part 2) ఫస్ట్ లుక్‌ను ఆ మధ్య మేకర్స్ ‘విడుదల 2’ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఈ డిసెంబరు నెలలో రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి రెండు సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో ఒకటి సినిమా నిడివి (లెంగ్త్) కాగా. రెండోది ఆర్థిక కష్టాలు. తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇపుడు రెండో భాగాన్ని అంతకుమించి అనే స్థాయిలో శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించిన నేపథ్యాన్ని చూపించనున్నారు. అయితే ఇటీవల విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ ‘మహారాజ’ తర్వాత వస్తున్న చిత్రంగా ‘విడుదల 2’పై మరింత హైప్ క్రియేట్ అవడం, సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో.. ఈ చిత్రాన్ని డిసెంబరు 20వ తేదీ విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్టు సమాచారం.
పైగా రెండో భాగం నడివి 4 గంటలకు పైగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం షూట్ చేస్తున్న సన్నివేశాలను కూడా కలిపితే ఈ నిడివి మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, థియేటర్‌కు మాత్రం 2.30 గంటల నిడివితో సినిమా విడుదల చేసి ఓటీటీకి మాత్రం పూర్తి నిడివితో ఉన్న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ (Elred Kumar) నిర్మించగా స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించారు.